Ashwin Coments : తాను అనుకోకుండా క్రికెటర్‌నయ్యానని, టీమిండియా జెర్సీ ధరిస్తానని అస్సలు అనుకోలేదని చెబుతున్నాడు ఇండియన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. విజయంలో కీలక పాత్ర పోషించి జట్టును గెలిపించిన సందర్భాల్లో ఆశీర్వాదంతో అలా జగిందని భావించేవాడినని కానీ కొవిడ్-19 వ్యాప్తితో భారత్ తరఫున ఆడటం ఎంతో అదృష్టమని తెలిసి వచ్చిందని పేర్కొన్నాడు.
ఐపీఎల్ కోసం దుబాయ్‌కు వెళ్లినప్పుడు అసలు తాను ఆస్ట్రేలియా పర్యటనలో ఆడతానని అనుకోలేదని ప్రతిదీ తనకు దక్కిన బహుమతే అంటూ చెప్పుకొచ్చాడు. ఆటను ప్రేమిస్తూ ఉంటే అదే మనకి తిరిగి విజయాల్ని అందిస్తుందని తెలిపాడు. ఆర్చర్ సమీక్షకు వెళ్లిన తర్వాత 400 వికెట్ల ఘనత సాధించానని తెలిసిందని, బోర్డుపై టెస్టుల్లో 400 వికెట్ల మార్క్‌ను అందుకున్నాని కనిపించిందని చెప్పాడు. స్టేడియంలోని ప్రేక్షకులు లేచి చప్పట్లతో అభినందించడంతో ఆ సమయంలో ఎలా భావోద్వేగం చెందానో చెప్పలేనన్నారు. గత మూడు నెలలు గొప్పగా సాగాయని పేర్కొన్నాడు.
మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో నాలుగు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా ఆ మైలురాయి చేరుకున్న రెండో బౌలర్‌గా యాష్ (77 టెస్టుల్లో) నిలిచాడు. తొలి స్థానంలో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ (72 టెస్టులు) ఉన్నాడు. ఈ సారి కూడా పిచ్ అనుకూలిస్తే మరోసారి అభిమానులు అశ్విన్ నుంచి మంచి ప్రదర్శన చూడవచ్చు.
టీమ్‌ఇండియా సిరీస్‌లో ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మార్చి 4 నుంచి ఇరు జట్ల మధ్యా నాలుగో టెస్టు జరగనుంది. భారత్ ఇది గెలిస్తే సగర్వంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఇందుకోసం ఆటగాళ్లందరు సన్నద్ధం అవుతున్నారు. కచ్చితంగా గెలిచి ఫైనల్‌కు అర్హత సాధిస్తామని ధీమాగా ఉన్నారు.
ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది.. అంతేకానీ ఎవరిని గుడ్డిగా అనుసరించనని చెబుతున్న క్రికెటర్..