Virat Kohli: 18 మ్యాచ్‌లు, 16 సెంచరీలు.. ప్రపంచకప్ 2027నకు ముందే కింగ్ కోహ్లీ దూకుడు..?

Rohit Sharma - Virat Kohli: ప్రస్తుత సమాచారం ప్రకారం, 2027 వన్డే ప్రపంచ కప్‌నకు ముందు భారత జట్టుకు కేవలం 18 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. 2025 సంవత్సరంలో టీమిండియాకు ఇక వన్డే మ్యాచ్‌లు లేవు. అంటే, తదుపరి వన్డే మ్యాచ్‌ల కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2026 వరకు వేచి చూడాల్సిందే.

Virat Kohli: 18 మ్యాచ్‌లు, 16 సెంచరీలు.. ప్రపంచకప్ 2027నకు ముందే కింగ్ కోహ్లీ దూకుడు..?
Virat Kohli Century

Updated on: Dec 10, 2025 | 8:21 PM

Team India: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో రాణించాడు. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో 102 పరుగులు చేయడం ద్వారా తన అంతర్జాతీయ కెరీర్‌లో 84వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును సమం చేయడానికి కోహ్లీకి ఇంకా 16 సెంచరీలు అవసరం.

కానీ, 2027 ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల సంఖ్య చూస్తే, ఈ రికార్డును చేరుకోవడం కోహ్లీకి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.

టీమిండియా షెడ్యూల్, మ్యాచ్‌ల వివరాలు:

ప్రస్తుత సమాచారం ప్రకారం, 2027 వన్డే ప్రపంచ కప్‌నకు ముందు భారత జట్టుకు కేవలం 18 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. 2025 సంవత్సరంలో టీమిండియాకు ఇక వన్డే మ్యాచ్‌లు లేవు. అంటే, తదుపరి వన్డే మ్యాచ్‌ల కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2026 వరకు వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి: Tilak Varma: కటక్ టీ20లో తెలుగబ్బాయ్ చారిత్రాత్మక రికార్డ్.. ఆ లిస్ట్‌లో తొలి భారతీయుడిగా..

ఈ 18 మ్యాచ్‌లలో 16 సెంచరీలు చేయడం విరాట్ కోహ్లీకి దాదాపు అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ కప్‌లో భారత జట్టు కనీసం 10 మ్యాచ్‌లు ఆడినా, మొత్తంగా కోహ్లీకి సుమారు 28 ఇన్నింగ్స్‌లు మాత్రమే దొరుకుతాయి. ఈ పరిమిత అవకాశాల్లో 16 సెంచరీలు సాధించడం అత్యంత కష్టమైన పని.

ఇది కూడా చదవండి: ఎవర్రా సామీ నువ్వు.. 23 ఫోర్లు, 18 సిక్సర్లు.. 56 బంతుల్లో 219 పరుగులు.. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

2026లో టీమిండియా వన్డే షెడ్యూల్:

2027 ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా 2026లో టీమిండియా ఆడబోయే సిరీస్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:

  • జనవరి 2026: న్యూజిలాండ్ (స్వదేశంలో) – 3 మ్యాచ్‌లు

  • జూన్ 2026: ఆఫ్ఘనిస్తాన్ (స్వదేశంలో) – 3 మ్యాచ్‌లు

  • జులై 2026: ఇంగ్లాండ్ (ఇంగ్లాండ్‌లో) – 3 మ్యాచ్‌లు

  • సెప్టెంబర్-అక్టోబర్ 2026: వెస్టిండీస్ (స్వదేశంలో) – 3 మ్యాచ్‌లు

  • అక్టోబర్-నవంబర్ 2026: న్యూజిలాండ్ (స్వదేశంలో) – 3 మ్యాచ్‌లు

  • డిసెంబర్ 2026: శ్రీలంక (స్వదేశంలో) – 3 మ్యాచ్‌లు

మొత్తంగా, ప్రపంచ కప్‌నకు ముందున్న ఈ తక్కువ సమయంలో కోహ్లీ తన సెంచరీల వేటను ఎలా కొనసాగిస్తాడో చూడాలి.