ప్రస్తుతం క్రికెట్‌లో టీ20లకు ఉన్న మజానే వేరు. సిక్సులు, ఫోర్ల వర్షం కురిపించేందుకు బ్యాట్స్‌మెన్స్ ఆరాపడుతుంటారు. బౌలర్లు కూడా పరుగులను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. మొత్తానికి ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పొట్టి క్రికెట్‌లో దొరుకుతుంది. అయితే, టీ20ని మించిన మరో ఫార్మెట్ టీ10 కూడా ఉంది. ఈ మ్యాచుల్లో మొత్తం 120 బంతులను రెండు జట్లు ఆడాల్సింది. అయితే, ఇలాంటి ఓ మ్యాచ్ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. టీం10పేరుతో నిర్వహించిన ఓ మ్యాచ్‌లో ఒక జట్టు కేవలం 8 ఓవర్లకు 10 వికెట్లు కోల్పోయింది. అవును నిజమే. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 56 బంతుల్లోనే ముగిసిపోవడం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ మ్యాచ్ నెట్టింట్లో సందడి చేస్తోంది. అసలు విషయానికి వస్తే.. ఇంగ్లండ్‌లో యార్క్‌షైర్ ప్రీమియర్ లీగ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఈస్టర్టన్ క్లబ్, హిలమ్ అండ్ మాంక్ ఫ్రిస్టన్ క్రికెట్ క్లబ్‌ల మధ్య జరిగింది. అతి తక్కువ టైంలో పూర్తయిన మ్యాచ్ గా పేరుగాంచింది.
ఈ మ్యాచ్‌లో హిలమ్ అండ్ ఫ్రిస్టన్ క్రికెట్ క్లబ్ మొదట బ్యాటింగ్ చేసింది. పరుగులు సాధించేందుకు బ్యాట్స్‌మెన్స్‌కు ఇష్టం లేదనుకుంటా. వెంటవెంటనే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్ చేరారు. క్రీజులోకి వచ్చినంత టైం కూడా బ్యాటింగ్ చేయడంలో చూపించలేదు. ఇలా మొత్తం 10మంది బ్యాట్స్‌మెన్స్ 8 ఓవర్లు ఆడి స్కోర్‌బోర్డుపై 7 పరుగులను చేర్చారు. ఇందులో మొత్తం 8మంది బ్యాట్స్‌మెన్స్ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. కాగా, ఇందులో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ తలో రెండు పరుగులు సాధించగా, మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూంలో వచ్చాయి. ఈస్టర్టన్ క్లబ్ బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 3 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 8 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్టర్టన్ క్లబ్.. కేవలం 1.2 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది.అంటే బంతికో పరుగు చొప్పున 8 బంతుల్లో 8 పరుగులు చేసి విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో ఓ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈస్టర్టన్ క్లబ్ ఓపెనర్లలో ఒకరైన జేమ్స్ కేంద్రా మొత్తం 8 బంతులను ఎదుర్కొన్నాడు. ఇందులో ఒక ఫోర్‌తో మొత్తం 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్‌ట్రాగా వచ్చింది.
Also Read:
ENG vs PAK: ఈ బౌలర్లకు భయపడుతోన్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్.. లిస్టులో టీమిండియా స్పిన్నర్ కూడా..!
WI vs AUS: రెండో టీ20లో వెస్టిండీస్ ఘన విజయం.. వరుసగా రెండవసారి ఖంగుతిన్న ఆస్ట్రేలియా టీం!