Video: ‘ఏయ్ బ్రో, ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నారు’..! సెంచరీ ప్లేయర్ షాకింగ్ స్టేట్‌మెంట్.. ఎవరంటే?

|

Jul 20, 2024 | 7:26 PM

Kavem Hodge - Mark Wood: ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతోంది. తొలి రోజు ఆతిథ్య జట్టు 416 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు విండీస్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 351/5 స్కోరు చేసింది. వెస్టిండీస్ తరపున, కవెమ్ హాడ్జ్ అద్భుతమైన సెంచరీని సాధించగా, అలిక్ అతానాజ్ 82 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

Video: ఏయ్ బ్రో, ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నారు..! సెంచరీ ప్లేయర్ షాకింగ్ స్టేట్‌మెంట్.. ఎవరంటే?
Kavem Hodge Comments
Follow us on

Kavem Hodge – Mark Wood: ఇంగ్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్ నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతోంది. తొలి రోజు ఆతిథ్య జట్టు 416 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో రోజు విండీస్ జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 351/5 స్కోరు చేసింది. వెస్టిండీస్ తరపున, కవెమ్ హాడ్జ్ అద్భుతమైన సెంచరీని సాధించగా, అలిక్ అతానాజ్ 82 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ 175 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా తమ జట్టును పోటీలో నిలిపారు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత, సెంచరీ ప్లేయర్ కావెం హాడ్జ్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. తన ఇన్నింగ్స్ గురించి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ సమయంలో, అతను మార్క్ వుడ్ ఫాస్ట్ స్పెల్ గురించి కూడా ఓ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.

ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీ చేయడం గొప్ప విషయం – హాడ్జ్..

మార్క్ వుడ్ రెండో రోజు దాదాపు గంటలకు 155 కిమీల వేగంతో బౌలింగ్ చేశాడు. అయితే అతని కొన్ని బంతులు గంటకు 157 కి.మీ.ల వేగంతో దూసుకొచ్చాయి. అతని అద్భుతమైన స్పెల్ గురించి, కవెమ్ హాడ్జ్ మాట్లాడుతూ, “అతని బౌలింగ్ చాలా భయంకరంగా ఉంది. అద్భుతంగా బ్యాటింగ్ చేయడం ప్రతిరోజూ కుదరదు. ప్రతి బంతికి 90 mph వేగంతో బౌలింగ్ చేసే బౌలర్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో మార్క్‌వుడ్‌పై ఓ సరదా కామెంట్ కూడా చేశాడు. ‘ఏయ్, నాకు ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నారు’ అంటూ టీజ్ చేశాడు. అలాగే, ఈ సెంచరీ నాకు టెస్ట్ క్రికెట్ విలువైనది, సవాలుగా ఉంది. మార్క్ వుడ్ వంటి బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.

కవెమ్ హాడ్జ్ తన తొలి సెంచరీ గురించి మాట్లాడుతూ, ‘టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ చేయడం ఒక కల. నేడు అది నిజమైంది. యువ ఆటగాడిగా ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీ చేయడం విశేషం. ఈ సెంచరీతో నేను సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. ముఖ్యంగా జట్టు పరిస్థితి బాగా లేనప్పుడు, ఇటువంటి పరిస్థితిలో సహకరించడం గొప్పగా అనిపిస్తుంది. 2017 తర్వాత ఒక వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లిష్ గడ్డపై సెంచరీ సాధించాడు. 2017 సంవత్సరంలో, ప్రస్తుత జట్టు కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ చివరిసారిగా ఇంగ్లాండ్ పిచ్‌లపై సెంచరీ చేశాడు. 120 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాడ్జ్ తన వికెట్‌ను క్రిస్ వోక్స్‌కు అప్పగించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..