
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ మరోసారి రికార్డుల వేదికగా మారింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ హై-స్కోరింగ్ పోరులో హెన్రిచ్ క్లాసెన్ తన విశ్వరూపాన్ని చూపించాడు. కేవలం 30 బంతుల్లోనే 65 పరుగులు చేసిన క్లాసెన్, తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇందులో 4 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు ఉండటం గమనార్హం.
ONE OF THE CRAZIEST SHOTS OF THE NIGHT FROM HEINRICH KLAASEN. 🤯 pic.twitter.com/s1S59AxzTV
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 29, 2026
ఈ ఇన్నింగ్స్ చూసిన దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ క్లాసెన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. “క్లాసెన్ ప్రదర్శన అద్భుతం. అతను ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బ్యాటర్ అని నేను నమ్ముతున్నాను. స్పిన్, ఫాస్ట్ బౌలింగ్‌ను సమానంగా ఎదుర్కోగల సత్తా అతనిలో ఉంది” అని డివిలియర్స్ పేర్కొన్నారు. క్లాసెన్ కేవలం సిక్సర్లు కొట్టడమే కాకుండా, మైదానం నలుమూలల షాట్లు ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడని కొనియాడారు.
HEINRICH KLAASEN SHOT AGAINST BUMRAH WAS TOTALLY INSANE. 🥶 pic.twitter.com/ScvDqueb2f
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 29, 2026
ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 243 పరుగులు చేసినప్పటికీ.. క్లాసెన్(65), ట్రావిస్ హెడ్(76) మెరుపులతో సన్‌రైజర్స్ ఆ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ బౌలర్లు కూడా క్లాసెన్ ధాటికి తట్టుకోలేకపోయారు. గత సీజన్ల నుంచి క్లాసెన్ ఫామ్ అద్భుతంగా ఉందని, అతను జట్టులో ఉండటం SRHకు కొండంత అండ అని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఈ ఇన్నింగ్స్‌తో క్లాసెన్ మరోసారి తన స్థాయిని నిరూపించుకున్నాడు. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటిదాకా 9 మ్యాచ్‌లు ఆడి.. అందులో 6 విజయాలు, 3 ఓటములతో 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Klaassen competing with the opening batters at IPL 2026 with runs scored and strike rate, considering the match situation(pressure & having to build partnerships in the middle overs) and lack of fielding restrictions he has to deal with(5 out from start to finish), is absolutely…
— AB de Villiers (@ABdeVilliers17) April 29, 2026
ఇది చదవండి: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..