Sachin Tendulkar Birthday: సచిన్ టెండూల్కర్ ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న, పెద్ద విషయాల గురించి తెలియని వారుండరు. అయితే, ఇప్పటికీ కొన్ని రహస్యాలు దాగే ఉన్నాయి. అలాంటి కొన్ని విషయాలు చెప్పలేదు, ఎక్కడా వినబడలేదు.
మాస్టర్ బ్లాస్టర్ జీవితానికి సంబంధించి మనం వినని, చెప్పని కథ ఒకటి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టని నాటి కథ ఇది. అతని సామర్థ్యం వల్ల కానీ, అతని తండ్రి పేరు గురించి కానీ, తెలియనప్పుడు ఈ విషయం జరిగింది.
సచిన్ చిన్నతనంలో అతనికి పడిన ఓ శిక్ష అతని జీవిత గమనాన్ని మార్చేసింది. దీంతో లిటిల్ మాస్టర్ జీవితానికి ఒక ప్రయోజనం దక్కింది. ఫలితంగా ప్రపంచ స్థాయి క్రీడాకారుడు ప్రపంచానికి లభించాడు. ఇది ప్రపంచ క్రికెట్‌కు వరం లాంటిది. సచిన్ టెండూల్కర్ ఈరోజు ఎక్కడ ఉన్నా, అతను ఎలా ఉన్నా, ఏ మారుపేరుతో పిలిచినా, అన్నీ ఆ శిక్షకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఎక్కువ సేపు ఆ విషయాన్ని చెప్పుకుండా దాచలేం. సచిన్ టెండూల్కర్‌కి విధించిన శిక్ష ఏమిటి? అతనికి ఆ శిక్ష ఎప్పుడు, ఎవరి ద్వారా విధించబడింది? ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కథ సచిన్ బాల్యానికి సంబంధించినది. పాఠశాలకు వేసవి సెలవులు ఇచ్చారు. దేవ్ ఆనంద్ సినిమా గైడ్ ఆదివారం సాయంత్రం నేషనల్ టీవీలో ప్రసారం అవుతోంది. ఈ సినిమా చూస్తున్న సచిన్ చెట్టుపై నుంచి పడిపోయాడు. ఈ యాక్సిడెంట్‌లో తనకి అన్నయ్య నుంచి శిక్ష తప్పదంటూ బాధపడ్డాడు. ఆ తర్వాత సచిన్ భయపడ్డదే జరిగింది.
సచిన్ టెండూల్కర్ అన్నయ్య అజిత్ టెండూల్కర్ విషయం తెలుసుకుని ఓ శిక్షను విధించాడు. శిక్షగా సచిన్‌ను క్రికెట్ అకాడమీలో అడ్మిషన్ ఇచ్చాడు. ఒక సాధారణ కుర్రాడి నుంచి క్రికెటర్‌గా, ఆపై సాధారణ ఆటగాడి నుంచి గొప్పగా మారిన సచిన్ ప్రయాణం అప్పుడే మొదలైందన్నమాట.
సచిన్ టెండూల్కర్ ఈ ప్రయాణం 24 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సాగింది. దాదాపు రెండున్నర దశాబ్దాలలో మాస్టర్ బ్లాస్టర్ 100 అంతర్జాతీయ సెంచరీలతో 34,000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌలర్లకు చుక్కలు చూపించి, వారికి ఓ పీడకలను మిగిల్చాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక రికార్డులను తన పేరిట సృష్టించాడు. అందుకే ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ అనే మారుపేరును సంపాదించుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..