AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs NZ: టీమిండియాలో కీలక మార్పు.. మూడో టెస్ట్‌లో జట్టుతో చేరిన కీలక ప్లేయర్

India Vs New Zealand 3rd Test: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా ఇప్పుడు మూడో మ్యాచ్‌కి జట్టులో పెద్ద మార్పు చేసింది. భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు చోటు దక్కింది. నవంబర్ 1 నుంచి ముంబై టెస్టు ఆడనుంది.

IND Vs NZ: టీమిండియాలో కీలక మార్పు.. మూడో టెస్ట్‌లో జట్టుతో చేరిన కీలక ప్లేయర్
Ind Vs Nz Harshit Rana
Venkata Chari
|

Updated on: Oct 29, 2024 | 7:57 PM

Share

Harshit Rana: నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాలో పెను మార్పు చోటు చేసుకుంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. ముంబై టెస్టులో హర్షిత్ రాణా అరంగేట్రం చేయగలడని విశ్వసిస్తున్నారు. ఎందుకంటే మూడో టెస్టు మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఎలాంటి నిర్ధారణ రాలేదు. హర్షిత్ రాణా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఢిల్లీకి చెందిన ఫాస్ట్ బౌలర్. ఈ ఆటగాడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం జట్టులో కూడా చోటు సంపాదించాడు.

హర్షిత్ రానా స్పెషాలిటీ ఏంటి?

హర్షిత్ రానా వయస్సు కేవలం 22 సంవత్సరాలు. అతను ఇంత చిన్న వయస్సులో టీమిండియాలో చేరాడు. హర్షిత్ రాణా స్పెషాలిటీ ఏంటంటే.. ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు. ఇటీవల, హర్షిత్ రాణా, అస్సాంపై ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా, అద్భుతమైన అర్ధ సెంచరీని కూడా సాధించాడు. ఈ స్పెషాలిటీ కారణంగానే అతనికి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కింది.

హర్షిత్ రానాకు అవకాశం వస్తుందా?

ఇప్పుడు ముంబై టెస్టులో హర్షిత్ రాణాకు టీమిండియా అవకాశం ఇస్తుందా? ముంబై టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వవచ్చని, అతను ఆడకపోతే హర్షిత్ రాణాకు ప్రత్యామ్నాయం కావచ్చని చెబుతున్నారు. అయితే, పుణె టెస్టులో విశ్రాంతి తీసుకున్న మహ్మద్ సిరాజ్ మ్యాచ్ కూడా ఆడగలడు. సరే, ఆస్ట్రేలియా వెళ్లే ముందు హర్షిత్ రానాకు అవకాశం ఇస్తే అది అతనికి మంచి అనుభవం.

హర్షిత్ రానా కెరీర్..

హర్షిత్ రానా దేశీయ కెరీర్ గురించి మాట్లాడితే, ఈ ఆటగాడు 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 36 వికెట్లు తీశాడు. ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన ఘనతను ఒకసారి సాధించాడు. దీంతో పాటు మ్యాచ్‌లో 10 వికెట్లు కూడా తీశాడు. అంతే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హర్షిత్ 41 సగటుతో 410 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..