బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. హైదరాబాద్ వేదికగా ఆదివారం (అక్టోబర్ 13) జరిగిన మూడో టీ20లో టీమిండియా 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తరఫున సంజూ శాంసన్ 111 పరుగుల తో సెంచీ ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ సూర్యకుమార్ 75 పరుగులు చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొత్తం సిరీస్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. అయితే హార్దిక్ ఈ అవార్డును అందుకునే ముందు హార్దిక్ చేసిన ఒక మంచి పని అందరి మన్ననలు అందుకుంది.
మూడో టీ20 మ్యాచ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టాడు హార్దిక్. కేవలం 18 బంతులు మాత్రమే ఎదుర్కొని 47 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హార్దిక్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, నాలుగు అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. తొలుత తన మెరుపు బ్యాటింగ్ తో అందరి మనసులు గెలుచుకున్న హార్దిక్.. ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తూ బాల్ బాయ్ తో సెల్ఫీ దిగి తన సింప్లిసిటీని చాటుకున్నాడు.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో, బౌండరీ లైన్ దగ్గర కూర్చున్న బాల్ బాయ్ హార్దిక్‌తో ఫోటో కావాలని రిక్వెస్ట్ చేశాడు. హార్దిక్ వెంటనే ఆ చిన్నారి అభిమాని కోరిక తీర్చి బౌండరీ దగ్గరకు వెళ్లి బాల్ బాయ్ తో సెల్ఫీ దిగాడు. హార్దిక్ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
What a kind hearted guy he is❤️
Hardik Pandya took selfies with ball-boys in the ground🫡 pic.twitter.com/jQqOJ9mumz— Rohan Gangta (@rohan_gangta) October 12, 2024
ఈ సిరీస్ లో భారత్ తరఫున మూడు టీ20లు ఆడిన హార్దిక్ 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 222.64 స్ట్రైక్ రేట్‌తో 118 పరుగులు చేశాడు. దీంతో టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. బౌలింగ్ లోనూ మ్యాజిక్ చేసిన హార్దిక్ మూడు మ్యాచ్ ల్లో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి 58 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..