Hrdik Pndya: బయో బబుల్‌లో జీవించడం కష్టం.. అయినా తప్పదు..

|

Jan 30, 2022 | 7:59 PM

హార్దిక్ పాండ్యా భారత క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టినప్పటి నుంచి మిడిల్ ఓవర్లలో పరుగులు చేస్తూనే ఉన్నాడు. దీంతో పాటు తన అద్భుతమైన బౌలింగ్‌తో జట్టుకు ముఖ్యమైన విజయాలను అందించాడు.

Hrdik Pndya: బయో బబుల్‌లో జీవించడం కష్టం.. అయినా తప్పదు..
Ipl 2022 Hardhik Pandya
Follow us on

హార్దిక్ పాండ్యా భారత క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టినప్పటి నుంచి మిడిల్ ఓవర్లలో పరుగులు చేస్తూనే ఉన్నాడు. దీంతో పాటు తన అద్భుతమైన బౌలింగ్‌తో జట్టుకు ముఖ్యమైన విజయాలను అందించాడు. అయితే ఈ ఆల్‌రౌండర్ ఇటీవలి కాలంలో గాయాలతో పోరాడుతున్నాడు. ఈ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు. పాండ్యా 2019లో వెన్నుముక గాయంతో బాధపడ్డాడు. అప్పటి నుండి అతను గాయాల బారిన పడుతున్నాడు. ఇప్పుడు ఈ ఆటగాడు తన పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాత IPL-2022 కి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈసారి తన పని తాను చేసుకుపోతానని చెప్పాడు.

ఐపీఎల్-2022లో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్‌కు పాండ్యా కెప్టెన్‌గా కనిపించనున్నాడు. ఇప్పటి వరకు అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. కానీ ఈసారి ముంబై అతనిని రిటైన్ చేయలేదు. శారీరకంగా మానసికంగా సన్నద్ధం కావడానికి ఈసారి కొంత సమయం తీసుకున్నానని పాండ్యా చెప్పాడు. ఇంగ్లీష్ వార్తాపత్రిక ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో “నేను జట్టు గురించి ఆలోచిస్తూ నా ప్రిపరేషన్‌లో తొందరపడ్డాను, కానీ ఈసారి మానసికంగా మరియు శారీరకంగా నన్ను నేను సిద్ధం చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నాను. నా కుటుంబం కోసం కొంత సమయం కేటాయించాలనుకున్నాను. బయో బబుల్‌లో ఎక్కువ సమయం గడుపుతాం. ప్రతి ఒక్కరూ మనల్ని సుఖంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, బయో బబుల్‌లో జీవించడం కష్టం.” అని పాండ్యా చెప్పాడు

తన పనిని నిశ్శబ్దంగా చేస్తానని, కష్టపడి పనిచేస్తానని, అలాగే కొనసాగిస్తానని పాండ్యా చెప్పాడు. “ చాలా కాలం పాటు మీ కుటుంబానికి దూరంగా ఉంటారం. ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. నేను ప్రతిరోజూ రెండు సెషన్లు ప్రాక్టీస్ చేస్తున్నానని పాండ్యా చెప్పుకొచ్చాడు.

Read Also.. Goutham Gambir: గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, ఇషాంత్ శర్మతో ఎలాంటి వివాదం లేదు.. పాక్ మాజీ వికెట్ కీపర్..