
IPL 2027 Trade: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు భారీ ట్రేడ్ డీల్ జరగబోతోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) పంజాబ్ కింగ్స్ (PBKS)కు వెళ్లనున్నాడని తెలుస్తోంది. అతడి స్థానంలో పంజాబ్ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ముంబైలోకి రానున్నాడు. అలాగే యువ బ్యాటర్ విష్ణు వినోద్ (Vishnu Vinod) కూడా పంజాబ్ నుంచి ముంబైకి వెళ్తాడని సమాచారం. ఫ్రాంచైజీతో విభేదాల కారణంగా హార్దిక్ ముంబైని వీడతారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ట్రేడ్ రిపోర్టులు ఆ ఊహాగానాలకు బలం చేకూర్చాయి.
స్పోర్ట్స్‌స్టార్ (Sportstar) నవంబర్ 3న ఇచ్చిన నివేదిక ప్రకారం, పంజాబ్ కింగ్స్ ఈ ట్రేడ్‌కు దగ్గరవుతోంది. పంజాబ్‌కు రికీ పాంటింగ్ కోచ్‌గా, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నారు. హార్దిక్‌ను ట్రేడ్ చేసే విషయంలో ముంబై మొత్తం మూడు జట్లతో సంప్రదింపులు జరిపిందని కూడా ఆ నివేదిక పేర్కొంది. చివరికి చర్చలు పంజాబ్‌తో అర్ష్‌దీప్, విష్ణు వినోద్‌ను ప్రతిఫలంగా ఇచ్చేలా కుదిరాయని తెలుస్తోంది.
ఈ ట్రేడ్‌కు సంబంధించిన పత్రాలను ఐపీఎల్ అధికారులు నవంబర్ 17 రిటెన్షన్ గడువులోపే ప్రాసెస్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
హార్దిక్ 2015 నుంచి 2021 వరకు ముంబైకి ఆడాడు. తర్వాత గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి, 2023లో ఆల్-క్యాష్ ట్రేడ్ ద్వారా మళ్లీ ముంబైకి తిరిగొచ్చాడు. అతడి కెప్టెన్సీలో 2024లో ముంబై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్ హార్దిక్‌కు అంతగా కలిసిరాలేదు. 10 మ్యాచ్‌ల్లో 22.89 సగటుతో 206 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 138.26, అత్యధిక స్కోరు 40. బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు.
అర్ష్‌దీప్ పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఈ ఏడాది ఏప్రిల్ 16న వాంఖడేలో ముంబైపై 3/22తో రాణించి, పంజాబ్ తరఫున ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 2025 వేలంలో రైట్ టు మ్యాచ్ (RTM) కార్డు ఉపయోగించి పంజాబ్ అతడిని రూ.18 కోట్లకు తిరిగి దక్కించుకుంది. 2025 సీజన్‌లో 21 వికెట్లతో పంజాబ్ టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఎక్కువమంది చదివినది: W,W,W,W,W,W,W,W,W.. ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో చెలరేగిన టీమిండియా ప్లేయర్..!
ఈ ట్రేడ్ జరిగితే పంజాబ్‌కు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ దొరుకుతాడు. ముంబైకి మాత్రం భారత జట్టులో రెగ్యులర్‌గా ఆడే ఫ్రంట్‌లైన్ పేసర్ లభిస్తాడు. కానీ అర్ష్‌దీప్ వెళ్లిపోతే పంజాబ్ న్యూ బాల్ అటాక్‌లో లోటు ఏర్పడవచ్చు. ఐపీఎల్ 2027 మినీ వేలం డిసెంబర్ 16న గోవాలో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..