AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ‘నల్ల ట్యాక్సీ’ అంటూ.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు! కామెంట్రీ చేస్తున్నారా.. నోటికొచ్చింది వాగుతున్నారా?

ఐపీఎల్ 2025 కామెంటేటర్‌ హర్భజన్ సింగ్, జోఫ్రా ఆర్చర్‌ను "నల్ల టాక్సీ"తో పోల్చిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నాడు. ఈ వ్యాఖ్యలు జాతి వివక్షను ప్రతిబింబిస్తున్నాయని, ఆర్చర్ రంగును ఉద్దేశించి చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు భజ్జీపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది గతంలో జరిగిన "మంకీగేట్" వివాదాన్ని గుర్తు చేస్తోంది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.

IPL 2025: 'నల్ల ట్యాక్సీ' అంటూ.. భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు! కామెంట్రీ చేస్తున్నారా.. నోటికొచ్చింది వాగుతున్నారా?
Jofra Jofra Harbhajan Singh
SN Pasha
|

Updated on: Mar 24, 2025 | 9:18 AM

Share

టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్‌ 2025లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భజ్జీ.. తన నోటి దూలతో మరోసారి క్రికెట్‌ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ ఆదివారం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా హిందీ వ్యవహరించిన హర్భజన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ను ‘నల్ల ట్యాక్సీ’తో పోల్చారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసేలా ఉన్నాయి. ఇప్పటికే సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు హర్భజన్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్యలు ఇంకా మానవా అంటూ మండిపడుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఆర్‌ఆర్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఆర్చర్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ ఓ రెండు ఫోర్లు బాదాడు. దీంతో.. కామెంట్రీ చేస్తున్న భజ్జీ.. “లండన్ మే కాలీ టాక్సీ కా మీటర్ తేజ్ భాగ్తా హై, ఔర్ యహా పే ఆర్చర్ సాహబ్ కా మీటర్ భీ తేజ్ భాగా హై” అంటూ వ్యాఖ్యానించాడు. దాని అర్థం ఏంటంటే.. లండన్‌లో నల్ల ట్యాక్సీల మీటర్‌ వేగంగా పరిగెడుతుంది.. ఇక్కడ ఆర్చర్‌ సాబ్‌ మీటర్‌ కూడా వేగంగా పరిగెడుతుంది అంటూ పేర్కొన్నాడు. లండన్‌లో బ్లాక్‌ ట్యాక్సీలు అని ఉంటాయి. ఎలాగైతే కోల్‌కతాలో ఎల్లో ట్యాక్సీలు ఉన్నాయో అలా అక్కడ బ్లాక్‌ ట్యాక్సీలు ఉంటాయి. మీటర్‌పై వాళ్లు ఎక్కువ డబ్బు ఛార్జ్‌ చేస్తారు. అయితే ఆర్చర్‌ను ఆ నల్ల ట్యాక్సీలతో పోల్చడంపై ఇప్పుడు వివాదం రాజుకుంది. ఆర్చర్‌ రంగును పరోక్షంగా ఉద్దేశిస్తూ.. భజ్జీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థం అవుతుంది.

గతంతో 2007-08 మధ్య భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో కూడా భజ్జీపై ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఆండ్రూ సైమండ్స్‌ను కోతి అని తిట్టాడని భజ్జీపై ఆసీస్‌ టీమ్‌ ఫిర్యాదు చేసింది. దాన్నే మంకీగేట్‌ వివాదం అని కూడా అంటారు. ఇప్పుడు మరోసారి ఓ ఫారెన్‌ ప్లేయర్‌పై భజ్జీ జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడో విమర్శలు వస్తున్నాయి. ఈ నోటి దూల ఇంకా తగ్గలేదా అంటూ అతనిపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. కామెంట్రీ పేరుతో చాలా మంది నోటికొచ్చింది వాగుతున్నారని, అనవసరంగా ప్లేయర్లను టార్గెట్‌ చేసి క్రిటిసైజ్‌ చేస్తున్నారంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. మరి చూడాలి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..