Harbhajan Singh: అరుదైన ఫొటో షేర్‌ చేసిన హర్భజన్‌.. మరి భజ్జీతో ఉన్న మిగతా క్రికెటర్లెవరో గుర్తు పట్టగలరా?

|

Dec 11, 2021 | 11:19 AM

మైదానంలో బంతితో మాయ చేయడమే కాదు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పి్న్నర్‌ హర్భజన్‌ సింగ్‌.

Harbhajan Singh: అరుదైన ఫొటో షేర్‌ చేసిన హర్భజన్‌.. మరి భజ్జీతో ఉన్న మిగతా క్రికెటర్లెవరో గుర్తు పట్టగలరా?
Follow us on

మైదానంలో బంతితో మాయ చేయడమే కాదు సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటాడు టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పి్న్నర్‌ హర్భజన్‌ సింగ్‌. తన ప్రొఫెషనల్‌ లైఫ్‌తో పాటు పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను అందులో షేర్‌ చేస్తూనే ఉంటాడు. ఇటీవల గల్లీలో క్రికెట్‌ ఆడుతూ షేర్‌ చేసిన వీడియో ఎంత వైరల్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా తాజాగా గత స్మృతుల్లోకి వెళ్లిపోయాడు మన భజ్జీ. అండర్‌-19 ప్రపంచకప్‌ నాటి మధురు జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో 1997-98 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్‌-19 ప్రపంచ కప్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు హర్భజన్. ఈ ఫొటోలో భజ్జీతో పాటు అండర్‌-19 ప్రపంచకప్‌లో పాల్గొన్న ఇద్దరు పాక్‌ క్రికెటర్లు ఉన్నారు.

కాగా ఈ ఫొటోకు భజ్జీ ‘పెహచానో టు మానే’ ( మమ్మల్ని గుర్తు పట్టండి) అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. అయితే ఈ ఫొటోలో హర్భజన్‌ సింగ్‌ను సులభంగా గుర్తు పట్టవచ్చు. కానీ మిగతా ఇద్దరు క్రికెటర్లను గుర్తు పట్టడం కొంచెం కష్టం. ఇక ఈ ఫొటోలో షర్ట్‌ లేకుండా కనిపిస్తున్నది ఒకప్పటి పాక్‌ అండర్‌-19 క్రికెటర్‌, ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న ఇమ్రాన్‌ తాహీర్‌. మరొకరు పాక్‌ ఆటగాడు హసన్‌ రాజా. కాగా ప్రస్తుతందక్షిణాఫ్రికాకు జట్టులో అగ్రశ్రేణి స్పి్న్నర్‌గా రాణిస్తోన్న తాహిర్‌ పాక్‌లోనే పుట్టి పెరిగాడు. ఆ దేశం తరఫున అండర్‌ -19 జాతీయ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత కుటుంబంతో సహా దక్షిణాఫ్రికాకు వలస వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. కాగా హసన్‌ రాజా విషయానికొస్తే అతను గతంలో పాక్‌ తరఫున కొన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడాడు. ఇక 1997-98 అండర్‌- 19 ప్రపంచకప్‌ విషయానికొస్తే ఈ టోర్నీలో భారత్, పాక్‌ జట్లు ఫైనల్‌ దాకా చేరుకోలేకపోయాయి. అయితే డర్బన్‌ వేదికగా జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు పాక్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసిన భజ్జీ కీలకమైన షోయబ్‌ మాలిక్‌ వికెట్‌ తీశాడు.

Virat Kohli: బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించిన దిలీప్ వెంగ్‎సర్కార్.. కోహ్లీ టెస్ట్‎లపై దృష్టి పెట్టగలడంటూ వ్యాఖ్యలు..

దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం చెమటోడ్చుతున్న రోహిత్‌.. ప్రాక్టీస్‌ వీడియో చూస్తే అదిరిపోవాల్సిందే..

ఈ ఫేమస్‌ మహిళా క్రికెటర్‌ని గుర్తుపట్టారా..! ఐపీఎల్‌లో మార్పులు ముందుగానే ఊహించింది..