అప్పుడేమో సబ్బులు, చీపుర్లు.. ఇప్పుడేమో అర ఎకరం భూమి.. అవార్డులు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు విజేతకు సాధారణంగా ట్రోఫీతో పాటు గణనీయమైన నగదు బహుమతిని అందజేస్తారు. కొన్నిసార్లు ద్విచక్ర వాహనాలు లేదా లగ్జరీ కార్లు లాంటి బహుమతులు కూడా ఇస్తుంటారు. మరి ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కోసం అవార్డు ఏం ఇచ్చారంటే.?

అప్పుడేమో సబ్బులు, చీపుర్లు.. ఇప్పుడేమో అర ఎకరం భూమి.. అవార్డులు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్
Cricket

Updated on: Jan 27, 2026 | 9:49 AM

క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు సాధారణంగా డబ్బు లేదా వెహికల్ లాంటివి బహుమతిగా అందిస్తారు. అయితే కెనడా జీటీ20 లీగ్‌లో రూథర్‌ఫర్డ్‌కు అరుదైన బహుమతి లభించింది. అతడికి అర ఎకరం భూమిని, అది కూడా అమెరికాలో, అవార్డుగా అందించారు. ఇది క్రికెట్ చరిత్రలో జరిగిన ఓ అరుదైన సంఘటన.. అదేంటో ఇప్పుడు చూసేద్దాం..

వివరాల్లోకి వెళ్తే.. క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు విజేతకు సాధారణంగా ట్రోఫీతో పాటు గణనీయమైన నగదు బహుమతిని అందజేస్తారు. కొన్నిసార్లు ద్విచక్ర వాహనాలు లేదా లగ్జరీ కార్లు లాంటి బహుమతులు కూడా ఇస్తుంటారు. అయితే, కెనడాలో జరిగిన జీటీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌కు అత్యంత అరుదైన, ప్రత్యేకమైన బహుమతిని ప్రకటించారు. ఇందులో నగదుకు బదులుగా, విజేతకు అమెరికాలో ఉన్న అర ఎకరం భూమిని బహుమతిగా అందించారు.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

ఇవి కూడా చదవండి

మాంట్రియల్ టైగర్స్ టీమ్ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, సిరీస్ మొత్తం 220 పరుగులు చేసిన వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్‌కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఒక క్రికెట్ ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా భూమిని బహుమతిగా ఇవ్వడం క్రికెట్ చరిత్రలోనే ఒక అసాధారణమైన, అరుదైన సంఘటనగా నిలుస్తుంది. ఇది సాధారణ ప్రైజ్ మనీకి భిన్నంగా, వినూత్నంగా ఉన్నందున ప్రపంచవ్యాప్తంగా ఇది వైరల్‌గా మారింది. ఈ ప్రత్యేకమైన బహుమతి క్రికెట్ అభిమానులలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. అలాగే పీఎస్ఎల్‌లో అవార్డులు గెలిచిన ఆటగాళ్లకు సబ్బులు, చీపుర్లు ఒకానొక సందర్భంలో రావడంతో.. వాటిని కూడా గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..