
Gujarat Titans vs Punjab Kings Match Result: చివరి ఓవర్ వరకు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. గుజరాత్ విధించిన 200 పరుగుల విజయ లక్ష్యాన్ని పంజాబ్ 19.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో 111 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పంజాబ్ ను శశాంక్ సింగ్ (29 బంతుల్లో 61, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆదుకున్నాడు. సంచలన ఇన్నింగ్స్ తో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు .అతనికి తోడు ఆఖరిలో అశుతోష్ శర్మ (17 బంతుల్లో 31, 3 ఫోర్లు, ఒక సిక్స్) ధాటిగా ఆడడంతో పంజాబ్ సంచలన విజయం సాధించింది. ఈ సీజన్‌లో నాలుగో మ్యాచ్‌లు ఆడిన పంజాబ్‌కు ఇది రెండో విజయం. అదే సమయంలో అన్నేసి మ్యాచ్ లు ఆడిన గుజరాత్ కు ఇది రెండో పరాజయం. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, మోహిత్ 1, ఉమేశ్ యాదవ్ 1, ఒమర్జాయ్ 1, రషీద్ ఖాన్ 1, దర్శన్ 1 వికెట్ తీశారు.
అంతకు ముందు పంజాబ్ టాస్ గెలిచి గుజరాత్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. శుభ్‌మన్ 48 బంతుల్లో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్‌తో పాటు వృద్ధిమాన్ సాహా 11, కేన్ విలియమ్సన్ 26, సాయి సుదర్శన్ 33, విజయ్ శంకర్ 8, రాహుల్ తెవాటియా 23* పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ 2 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్, హర్‌ప్రీత్ బ్రార్ ఇద్దరూ ఒక్కో వికెట్ తీశారు.
Shik Shak Shashank 🔥#GTvPBKS #TATAIPL #IPLonJioCinema #IPLinHaryanvi pic.twitter.com/L5wYaiDxWR
— JioCinema (@JioCinema) April 4, 2024
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ -XI)
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, దర్శన్ నల్కండే.
BR శరత్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్, అభినవ్ మనోహర్, మానవ్ సుతార్
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ -XI)
శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, కగిసో రబాడ.
తాన్య త్యాగరాజన్, నాథన్ ఎల్లిస్, అశుతోష్ శర్మ, రాహుల్ చాహర్, విద్వత్ కవీరప్ప
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..