ఇండియన్ ప్రీమియర్ లీగ్ 7వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ 163 పరుగుల లక్ష్యాన్ని అందించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది.
డేవిడ్ వార్నర్ 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తర్వాత సర్ఫరాజ్ ఖాన్ 30 పరుగులు జోడించాడు. స్లాగ్ ఓవర్లలో అక్షర్ పటేల్ భారీ షాట్లు ఆడుతూ స్కోరును 150 పరుగులకు చేర్చాడు. 22 బంతుల్లో 36 పరుగులు చేశాడు. గుజరాత్ తరపున మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ తలో 3 వికెట్లు తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..