IPL Auction 2026 : అతడి పై మొదటి నుంచీ మా కన్ను ఉంది..గుజరాత్ టైటాన్స్ వేలంలోకి దిగితే మామూలుగా ఉండదు

IPL Auction 2026 : ఐపీఎల్ 2026 కోసం అబుదాబిలో మంగళవారం జరిగిన మినీ-వేలంలో గుజరాత్ టైటాన్స్ తన పక్కా, ఖచ్చితమైన వ్యూహంతో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌తో పాటు, ఇద్దరు భారతీయ అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్లు పృథ్వీ రాజ్ యారా, అశోక్ శర్మలను గుజరాత్ టైటాన్స్ తమ జట్టులోకి తీసుకుంది.

IPL Auction 2026 :  అతడి పై మొదటి నుంచీ మా కన్ను ఉంది..గుజరాత్ టైటాన్స్ వేలంలోకి దిగితే మామూలుగా ఉండదు
Gujarat Titans

Updated on: Dec 17, 2025 | 3:28 PM

IPL Auction 2026 : ఐపీఎల్ 2026 కోసం అబుదాబిలో మంగళవారం జరిగిన మినీ-వేలంలో గుజరాత్ టైటాన్స్ తన పక్కా, ఖచ్చితమైన వ్యూహంతో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌తో పాటు, ఇద్దరు భారతీయ అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్లు పృథ్వీ రాజ్ యారా, అశోక్ శర్మలను గుజరాత్ టైటాన్స్ తమ జట్టులోకి తీసుకుంది. ఈ కొనుగోళ్ల వెనుక ఉన్న వ్యూహాన్ని, గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్ అయిన పార్థివ్ పటేల్ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరంగా తెలియజేశారు.

పార్థివ్ పటేల్ మాట్లాడుతూ.. “జేసన్ హోల్డర్ గత ఏడాదిన్నరగా టీ20 ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. అతను ఎక్కడ టీ20 లీగ్ ఆడినా, అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అందుకే మేము చాలా కాలంగా అతనిపై దృష్టి పెట్టాము” అని తెలిపారు. అనుభవానికి ఎల్లప్పుడూ గుజరాత్ టైటాన్స్ ప్రాధాన్యత ఇస్తుందని, హోల్డర్ చాలా అనుభవజ్ఞుడైన ఆటగాడని, అంతేకాకుండా ఒక ఆల్‌రౌండర్ జట్టుకు ఎప్పుడూ ముఖ్యమని పార్థివ్ వివరించారు. లీగ్‌లలో, అంతర్జాతీయ స్థాయిలో హోల్డర్ మొత్తం 326 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను 345 వికెట్లు తీయడంతో పాటు, 134.92 స్ట్రైక్ రేట్‌తో 3,133 పరుగులు చేశాడు. వెస్టిండీస్ తరపున కూడా 86 మ్యాచ్‌లలో 97 వికెట్లు, 746 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ లో చేరడానికి ముందు హోల్డర్ CSK, SRH, KKR, LSG, RR వంటి జట్ల తరఫున ఆడాడు.

అశోక్ శర్మ, పృథ్వీ రాజ్ యారా, ల్యూక్ వుడ్ రూపంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను కొనుగోలు చేయాలనే వ్యూహంపై కూడా పార్థివ్ పటేల్ మాట్లాడారు. “అశోక్ శర్మ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అతను దేశవాళీ క్రికెట్‌లో చాలా బాగా రాణించాడు. మాకు ఒక అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంది. అందుకే అతనిపై మేము చాలా కాలంగా నిఘా ఉంచాం. అందుకే వేలంలో అతన్ని జట్టులోకి తీసుకున్నాం” అని పార్థివ్ తెలిపారు. అలాగే, గుజరాత్ టైటాన్స్ ప్రధాన పేసర్ అయిన రబాడాకు మద్దతు ఇవ్వడానికి ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అవసరం ఉందని, అందుకే పృథ్వీ రాజ్ యారా, ల్యూక్ వుడ్‌లను తీసుకున్నామని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పృథ్వీ రాజ్ యారా కూడా కొంత కాలంగా క్రికెట్ ఆడుతున్నాడని, అతన్ని జట్టులో చేర్చుకోవడం తమకు సంతోషంగా ఉందని పార్థివ్ పటేల్ పేర్కొన్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..