GT vs RR IPL 2022 Head To Head: ఫైనల్ చేరేదెవరో.. తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ వర్సెస్ రాజస్థాన్‌ ఢీ.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?

GT vs RR IPL 2022: గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నాయి.

GT vs RR IPL 2022 Head To Head: ఫైనల్ చేరేదెవరో.. తొలి  క్వాలిఫయర్‌లో గుజరాత్ వర్సెస్ రాజస్థాన్‌ ఢీ.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?
Ipl 2022 Playoff Gt Vs Rr

Updated on: May 24, 2022 | 8:50 AM

IPL 2022 ప్లేఆఫ్(IPL 2022 Playoff) రౌండ్ మే 24 మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మార్చి 26 నుంచి ప్రారంభమైన ఈ లీగ్ 15వ సీజన్‌లో 70 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్రస్తుతం టైటిల్ మ్యాచ్‌లో చోటు దక్కించుకున్న 10 జట్లలో నాలుగు జట్ల మధ్య ఇదే చివరి పోరు. ఈ సీజన్‌లో అత్యంత నిలకడగా రాణించి, బాగా ఆకట్టుకున్న రెండు జట్ల మధ్య ప్లేఆఫ్‌లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. లీగ్ దశలో మొదటి స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (GT vs RR)తో తలపడనుంది. మిగతా జట్లపై ఇద్దరూ బాగా ఆడినా, ఢీకొన్నప్పుడు ఎవరిది పైచేయిగా నిలిచిందో ఇప్పుడు చూద్దాం.

ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసింది. ఇటువంటి పరిస్థితిలో, లీగ్‌లోని ఏ జట్టుపైనా దీనికి పాత రికార్డు లేదు. గుజరాత్ తొలిసారిగా ప్రతి జట్టుతో పోటీ పడింది. కొన్ని జట్లతో రెండుసార్లు పోటీపడినా లీగ్ దశలో రాజస్థాన్‌తో ఒక్కసారి మాత్రమే తలపడింది. రెండు వేర్వేరు గ్రూపులుగా ఉండడం వల్ల ఇలా జరిగింది.

అద్భుతాలు చేసిన హార్దిక్ పాండ్యా బ్యాట్..

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్ దాదాపు నెలన్నర క్రితం జరిగింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో ఏప్రిల్ 14న జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మొదట బ్యాటింగ్ చేసింది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. హార్దిక్ మొదట అభినవ్ మనోహర్‌తో కలిసి 86 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఆపై డేవిడ్ మిల్లర్‌తో కలిసి చివరి 4 ఓవర్లలో 53 పరుగులు జోడించాడు. హార్దిక్ పాండ్యా కేవలం 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 87 పరుగులు చేశాడు. మిల్లర్ 31 (14 బంతులు), మనోహర్ 43 పరుగులు (28 బంతులు) చేశారు.

బ్యాటింగ్ తర్వాత గుజరాత్ బంతితోనూ అద్భుతాలు చేసింది. రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ వేగంగా ప్రారంభించి పవర్‌ప్లేలోనే వేగంగా అర్ధ సెంచరీ సాధించాడు. కానీ, రాజస్థాన్ కూడా వరుసగా వికెట్లు కోల్పోవడంతో తొలి 6 ఓవర్లలో బట్లర్ సహా ముగ్గురు ఆటగాళ్లు ఔటయ్యారు. బట్లర్ 24 బంతుల్లో 54 పరుగులు చేశాడు. దీని తర్వాత ఏ బ్యాట్స్‌మెన్ కూడా భారీ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ తరపున లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్ తలో 3 వికెట్లు తీసి 37 పరుగుల తేడాతో జట్టును గెలిపించారు.