
Gujarat Titans vs Royal Challengers Bengaluru, 45th Match: IPL 2024లో డబుల్ హెడర్ (ఒక రోజు 2 మ్యాచ్‌లు) ఈరోజు జరగుతున్నాయి. మొదటి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ (GT), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ సీజన్లో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
కాగా, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్లో గుజరాత్, బెంగళూరు మధ్య మొత్తం 3 మ్యాచ్‌లు జరిగాయి. 2 మ్యాచ్‌ల్లో గుజరాత్ గెలవగా, 1 మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. అదే సమయంలో నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి.
అహ్మదాబాద్‌లోని పిచ్ బ్యాట్స్‌మెన్‌కు సహాయకరంగా ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 31 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. 14 మ్యాచ్‌ల్లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించగా, 17 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ జట్టు విజయం సాధించింది. గత సీజన్లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ చేసిన 233/3 అత్యధిక జట్టు స్కోరు.
గుజరాత్ టైటాన్స్ – వృద్ధిమాన్ సాహా(కీపర్), శుబ్మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, హిమాన్షు శర్మ, ఆకాష్ దీప్, విజయ్‌కుమార్ వైషాక్.
గుజరాత్ టైటాన్స్: సందీప్ వారియర్, శరత్ బీఆర్, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..