CSK vs GT 1st Innings Highlights: హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన సాహా, సాయి.. చెన్నై ముందు భారీ టార్గెట్..

|

May 29, 2023 | 9:27 PM

Chennai Super Kings vs Gujarat Titans, Final (Reserve day): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు రిజర్వ్ డే రోజున చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్(GT) మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ చరిత్రలో రిజర్వ్ డే రోజున ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. ఆదివారం అహ్మదాబాద్‌లో వర్షం కురవడంతో మ్యాచ్ జరగలేదు. టాస్ గెలిచిన ధోనీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ […]

CSK vs GT 1st Innings Highlights: హాఫ్ సెంచరీలతో దుమ్మురేపిన సాహా, సాయి.. చెన్నై ముందు భారీ టార్గెట్..
Csk Vs Gt Ipl 2023 Final
Follow us on

Chennai Super Kings vs Gujarat Titans, Final (Reserve day): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు రిజర్వ్ డే రోజున చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్(GT) మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ చరిత్రలో రిజర్వ్ డే రోజున ఫైనల్ జరగడం ఇదే తొలిసారి. ఆదివారం అహ్మదాబాద్‌లో వర్షం కురవడంతో మ్యాచ్ జరగలేదు. టాస్ గెలిచిన ధోనీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు 215 పరుగుల టార్గెట్ నిలిచింది. చెన్నై బౌలర్లలో మతిష్ పతిరనా 2 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్, రవీంద్ర జడేజా  తలో వికెట్ తీశారు.

33 బంతుల్లో సుదర్శన్ హాఫ్ సెంచరీ..

శుభ్‌మన్ గిల్ తర్వాత నంబర్-3లో బ్యాటింగ్‌కు వచ్చిన సాయి సుదర్శన్ నిలకడగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 12వ ఓవర్ తర్వాత స్పిన్నర్లపై భారీ షాట్లు కొట్టడం ప్రారంభించారు. 33 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో 96 పరుగుల వద్ద సాయి సుదర్శన్ పెవిలియన్ చేరి, సెంచరీ కోల్పోయాడు.

36 బంతుల్లో సాహా హాఫ్ సెంచరీ..

గుజరాత్‌ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 36 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. పవర్‌ప్లే ఓవర్లలోనే భారీ షాట్లు కొట్టడం ప్రారంభించాడు. మొదట గిల్‌తో కలిసి 67 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్‌తో కలిసి 64 పరుగుల భాగస్వామ్యాన్ని కూడా పంచుకున్నాడు. అతను 39 బంతుల్లో 54 పరుగులు చేసిన తర్వాత దీపక్ చాహర్‌కు బలి అయ్యాడు.

ఇవి కూడా చదవండి

పవర్‌ప్లేలో పవర్ చూపించిన ఓపెనర్స్..

ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ తొలి 2 ఓవర్లలో నెమ్మదిగా ఆరంభించింది. కానీ మూడో ఓవర్ నుంచి వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్ వేగంగా పరుగులు చేయడం ప్రారంభించారు. ఇద్దరు ఆటగాళ్లు కూడా ఒక లైఫ్‌ని పొందారు. ఆ తర్వాత వీరిద్దరూ భారీ షాట్‌లు కొట్టి జట్టు స్కోరును 6 ఓవర్లలో 62 పరుగులకు తీసుకెళ్లారు.

వీరిద్దరి మధ్య 67 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. 39 పరుగుల వద్ద గిల్ ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

జట్లు:

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..