
IND vs ENG 4th Test:ఇంగ్లాండ్‌తో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డై లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలి. గాయాల బెడద టీమిండియాను వెంటాడుతోంది. నితీష్ కుమార్ రెడ్డి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అర్షదీప్ సింగ్ కూడా నాలుగో టెస్ట్ ఆడటం లేదు. రిషబ్ పంత్ గురించి కూడా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అతను కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడతాడని, వికెట్ కీపింగ్ చేయడం కష్టమని తెలిసింది. అయితే, ఇప్పుడు ఒక వీడియో బయటపడింది. దీంతో శుభమన్ గిల్ టెన్షన్ కొంత తగ్గిందని చెప్పొచ్చు.
మూడో టెస్టు మొదటి రోజే రిషబ్ పంత్ వేలికి గాయమైంది. దీంతో అతను మైదానం నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ అంతా ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసినా తను కంప్లీట్ ఫిట్‌గా లేడు. దీంతో నాలుగో టెస్టుకు పంత్ దూరం అవుతాడని, లేదా కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడతాడని చాలా వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు వచ్చిన కొత్త వీడియో అభిమానులకు కాస్త ఊరటనిచ్చింది. రిషబ్ పంత్ కు సంబంధించిన ఒక వీడియో బయటపడింది. ఇది మాంచెస్టర్‌లో ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించినది. ఈ వీడియోలో పంత్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను చాలా సేపు వికెట్ కీపింగ్ చేశాడు. అతనికి ఎలాంటి ఇబ్బంది ఉన్నట్లు కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే, నాలుగో టెస్టులో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
రిషబ్ పంత్ ఈ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు (134, 118) సాధించాడు. రెండో టెస్టులో (25, 65) రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గాయం ఉన్నప్పటికీ మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులకే అవుటయ్యాడు. అతని బ్యాటింగ్ ఫామ్ టీమిండియాకు చాలా కీలకం.
భారత్‌కు నాలుగో టెస్ట్ డూ ఆర్ డై లాంటిది. సిరీస్‌లో మొదటి టెస్టును ఇంగ్లాండ్, రెండో టెస్టును భారత్ గెలిచాయి. మూడో టెస్టులో విజయం సాధించి ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో టెస్టును ఇంగ్లాండ్ గెలిస్తే, సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధిస్తుంది. అదే జరిగితే, ఐదవ టెస్టును గెలిచినా ఇంగ్లాండ్ సిరీస్‌ను సమం చేయగలదు. టీమిండియా ఈ టెస్టును గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని చూస్తోంది. ఒకవేళ ఈ టెస్ట్ డ్రా అయినా, ఇంగ్లాండ్‌కు సిరీస్ ఓటమి భయం ఉండదు. అందుకే ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం.
VIDEO | Indian wicket-keeper batter Rishabh Pant (@RishabhPant17) resumes his keeping duty during the practice session at the Old Trafford Cricket stadium in Manchester, UK after sustaining an injury in the last Test.#RishabhPant #indiavsengland pic.twitter.com/L5xzJILONk
— Press Trust of India (@PTI_News) July 21, 2025
If calm had a sound, it would be this 🏏🔊#RP17 pic.twitter.com/q5EAxVA98W
— Rishabh Pant (@RishabhPant17) July 20, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..