AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir : టీమిండియా వరుస ఓటములు.. అసలు లోపం ఎక్కడుందో చెప్పిన గౌతమ్ గంభీర్

Gautam Gambhir : ఇంగ్లండ్‌తో వరుస టీ20 ఓటముల తర్వాత గౌతమ్ గంభీర్ స్పందించారు. టీమిండియా ప్రస్తుతం రీసెట్ దశలో ఉందని, యువ ఆటగాళ్లకు సమయం అవసరమని చెప్పారు. గేమ్ అవేర్‌నెస్ లోపమే ప్రధాన సమస్యగా పేర్కొంటూ ప్రిన్స్ యాదవ్ ప్రదర్శనను ప్రశంసించారు.

Gautam Gambhir  : టీమిండియా వరుస ఓటములు.. అసలు లోపం ఎక్కడుందో చెప్పిన గౌతమ్ గంభీర్
Gautam Gambhir
Rakesh
|

Updated on: Jul 08, 2026 | 3:21 PM

Share

Gautam Gambhir : ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలుకావడం పై భారత క్రికెట్ జట్టు ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారిగా పెదవి విప్పారు. జట్టు పేలవ ప్రదర్శనపై ఆయన స్పందిస్తూ.. టీమిండియా ప్రస్తుతం ఒక మార్పు లేదా రీసెట్ దశ గుండా వెళుతోందని, కాబట్టి యువ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకోవడానికి కొంత సమయం ఇవ్వడం ఎంతో అవసరమని అన్నారు. కేవలం అనుభవం లేకపోవడమో లేదా ఫామ్ సరిగ్గా లేకపోవడమో మాత్రమే ప్రస్తుత సమస్య కాదని, భారత జట్టు అసలు ఏ విషయంలో వెనుకబడి ఉందో గంభీర్ క్లియర్ కట్‌గా వివరించారు.

ప్లేయర్లలో గేమ్ అవేర్‌నెస్ లోపించింది

గౌతమ్ గంభీర్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత భారత జట్టులో సాంకేతిక లోపాలకంటే కూడా గేమ్ అవేర్‌నెస్ చాలా తక్కువగా ఉంది. ఐర్లాండ్ పర్యటన నుంచి మొదలై ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ వరకు మన ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతున్న తీరును, పిచ్ కండిషన్లను సరిగ్గా అంచనా వేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారని మండిపడ్డారు. పిచ్ ఎలా ప్రవర్తిస్తోంది, గాలి ఏ వైపు వీస్తోంది, మైదానంలో ఏ వైపు బౌండరీ పెద్దగా ఉంది, ఏ సమయంలో భారీ షాట్లకు ప్రయత్నించి రిస్క్ తీసుకోవాలి అనే చిన్న చిన్న విషయాలను గమనించడంలో ఆటగాళ్లు తప్పులు చేస్తున్నారని, టీ20 క్రికెట్‌లో ఇవే మ్యాచ్ ఫలితాలను మార్చేస్తాయని గంభీర్ విశ్లేషించారు.

టీమ్ మార్పుల దశలో ఉంది

గతంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుతో ప్రస్తుత యువ జట్టును పోల్చడం ఎంతమాత్రం సరికాదని హెడ్ కోచ్ స్పష్టం చేశారు. ఇప్పుడు జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చారని, ఓపెనింగ్ జోడీ సరికొత్తగా ఉందని గుర్తు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఈ జట్టులో లేరని చెప్పారు. ఒక జట్టును పూర్తిగా రీసెట్ చేస్తున్నప్పుడు ఒడిదుడుకులు సహజమన్న ఆయన.. 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా వస్తున్నాడని, యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ తన కెరీర్‌లో రెండో మ్యాచ్ మాత్రమే ఆడుతున్నాడని, అలాగే హర్షిత్ రాణా గాయం తర్వాత ఇప్పుడిప్పుడే జట్టులోకి తిరిగొచ్చాడని వివరించారు. కాబట్టి కేవలం మ్యాచ్ ఫలితాల ఆధారంగానే జట్టు భవిష్యత్తును అంచనా వేయకూడదని కోరారు.

76 పరుగులకే ఆలౌట్ అయినా తగ్గేదేలే

మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కేవలం 76 పరుగులకే కుప్పకూలడం అనేది పరుగుల పరంగా భారత్‌కు అతిపెద్ద ఓటమి అయినప్పటికీ, గంభీర్ మాత్రం ఆటగాళ్లపై నమ్మకాన్ని కోల్పోలేదు. దీనిని జట్టు యొక్క శాశ్వత బలహీనతగా తాను భావించడం లేదని చెప్పారు. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌లలో మన బ్యాటర్లు దాదాపు 190 పరుగుల మార్కును టచ్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం జట్టు చాలా ఆగ్రెసివ్ మరియు హై-రిస్క్ క్రికెట్ ఆడుతోందని, అలాంటప్పుడు ఇలాంటి చెత్త రోజులు కూడా ఎదురవుతుంటాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో బలమైన జట్టును తయారు చేయాలంటే.. ఇంగ్లండ్ లాంటి పటిష్టమైన టీమ్స్‌పై యువ ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇవ్వాలని, దీనివల్ల ఓటములు ఎదురైనా ప్లేయర్లు మానసికంగా ఎదుగుతారని గంభీర్ ధీమా వ్యక్తం చేశారు.

యంగ్ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌పై గంభీర్ ప్రశంసల జల్లు

మూడో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ పూర్తిగా ఫెయిల్ అయినప్పటికీ, యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ ప్రదర్శనపై కోచ్ గంభీర్ సంతోషం వ్యక్తం చేశారు. తన కెరీర్‌లో కేవలం రెండో మ్యాచ్ మాత్రమే ఆడుతున్న ప్రిన్స్ యాదవ్.. పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ ఎంతో బాధ్యతాయుతంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడని కొనియాడారు. ఏ ఆటగాడినైనా కేవలం గణాంకాలు, రికార్డుల ఆధారంగానే అంచనా వేయకూడదని, ప్రిన్స్ యాదవ్ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేశాడనేది గమనించాలన్నారు. ఈ యువ పేసర్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉందని గంభీర్ జోస్యం చెప్పారు.

గంభీర్ రీసెట్ ప్లాన్ ముందున్న అసలైన సవాల్

ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో భారత జట్టు ప్రస్తుతం 0-2 తో వెనుకబడి ఉంది. ఇలాంటి స్థితిలో రాబోయే మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకం కానుంది. వచ్చే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవడమే కాకుండా.. కోచ్ గౌతమ్ గంభీర్ నమ్ముతున్న రీసెట్ ప్లాన్ జట్టును సరైన విజయాల బాటలోనే నడిపిస్తోందని నిరూపించాల్సిన పెద్ద సవాల్ ఇప్పుడు రోహిత్ సేన లేదా ఈ యువ భారత్ ముందు ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us