Michael Vaughan: విదేశీ లీగ్‎ల్లో భారత ఆటగాళ్లను ఆడనివ్వాలి.. అప్పుడే అలాంటి పిచ్‎లను అర్థం చేసుకుంటారు..

|

Nov 01, 2021 | 7:02 PM

న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత జట్టుపై అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. ఇండియా ఈ మ్యాచ్‎లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్ కప్ 2021లో భారత్ సెమీస్‎కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది...

Michael Vaughan: విదేశీ లీగ్‎ల్లో భారత ఆటగాళ్లను ఆడనివ్వాలి.. అప్పుడే అలాంటి పిచ్‎లను అర్థం చేసుకుంటారు..
Wagha
Follow us on

న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన భారత జట్టుపై అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్నారు. ఇండియా ఈ మ్యాచ్‎లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్ కప్ 2021లో భారత్ సెమీస్‎కు వెళ్లడం దాదాపు అసాధ్యంగా మారింది. న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడానికి భారత్ చాలా కష్టపడ్డారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‎లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 110 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‎కు కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని బ్లాక్‌క్యాప్స్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి, 33 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. భారత్ వరుసగా రెండు మ్యాచ్‎ల్లో ఓడిపోవడంతో గ్రూప్-2లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్‎లో భారత్ ఆటపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ విమర్శలు గుప్పించారు. “భారత్ ఈ T20 వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించేలా ఉందన్నారు. ఇంత ప్రతిభ ఉండి, పెద్ద జట్టుగా పేరొందిన టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దారుణంగా విఫలమవుతుందని ట్వీట్ చేశాడు.

“భారత్ 2010 క్రికెట్ ఆడుతోందని.. కానీ ఆట చాలా మారిందని” మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ప్రపంచంలోని ఇతర దేశాల్లో నిర్వహిస్తున్న అన్ని లీగ్‌ మ్యాచ్‌లలో ఆడేందుకు భారత క్రికెటర్లకు అనుమతినివ్వాలని బీసీసీఐకి మైకేల్‌ వాన్‌ సూచించాడు. తద్వారా వారికి అనుభవం వస్తుందన్నారు.

Read Also.. T20 World Cup 2021: ఆటగాళ్లు అలసటగా ఉన్నారు.. విరామం అవసరం.. జస్ప్రీత్ బుమ్రా..