
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డర్ – గావాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లేముందు కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ పై రికి పాటింగ్ చేసిన కామెంట్స్ కు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. అసలు భారత క్రికెట్‌తో పాంటింగ్‌కు ఏం సంబంధం అని ప్రశ్నించాడు. అతడు ఆస్ట్రేలియా క్రికెట్ సంగతి చూసుకుంటే మంచిదని హితవు పలికాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ల ఫామ్ పై తనకు ఆందోళన లేదన్నాడు. కొత్తగా వారు నిరూపించుకోవాల్సింది ఏమీలేదన్నాడు. గత సిరీస్ (కివీస్‌తో టెస్టు సిరీస్) ఫలితంతో వారిద్దరూ కసితో ఉన్నారని, వారు నెట్స్‌లో కష్టపడుతున్నారన్నాడు. గత సిరీస్ ఫలితంతో వారిద్దరిలో కసి రెట్టింపైందని, డ్రెస్సింగ్స్ రూమ్‌లో అలాంటి కసి ఉండాలన్నారు. ఆసీస్ సిరీస్‌లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ గురించి ఐసీసీ పాడ్కాస్ట్ తో మాట్లాడిన పాటింగ్ టీమిండియా స్టార్ కోహ్లీ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో టెస్టు సిరీస్ గెలవాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా భారీగా పరుగులు సాధించాలని పాంటింగ్ అన్నాడు. కోహ్లీ ఫామ్ లో లేకపోయిన చాలా ప్రమాదకరం అంటూ కొనియాడుతూనే గత ఐదేళ్లలో టెస్టుల్లో అతడు రెండు సెంచరీలే చేశాడన్నారు. అతడి స్థానంలో టాప్ ఆర్డర్‌లో మరే బ్యాటర్ అయినా ఇన్నాళ్లు జట్టులో కొనసాగడం కష్టమని.. తన ఫేమ్‌తోనే కోహ్లీ జట్టులో కొనసాగుతున్నాడని పరోక్షంగా విమర్శించాడు.
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.. రిజర్వ్: ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైని, ఖలీల్ అహ్మద్