IND vs AUS: తొలి టెస్ట్‌లో ఓపెనర్లుగా ఆ ఇద్దరే.. రోహిత్ గైర్హాజరీపై గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే?
Gautam Gambhir Press Conference: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం టీమ్ ఇండియా ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశం నిర్వహించి అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రోహిత్ శర్మ తొలి టెస్టు ఆడకపోతే ఎవరు ఓపెనింగ్ చేయగలరు? అనే ప్రశ్నకు కూడా క్లియర్ కట్‌గా సమాధానం ఇచ్చాడు.

Gautam Gambhir Press Conference: ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్టులోని తొలి బృందం ఈరోజు (సోమవారం) ఆస్ట్రేలియాకు బయలుదేరింది. రెండో బ్యాచ్‌లో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇతర ఆటగాళ్లతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. అంతకుముందు గంభీర్ విలేకరుల సమావేశం నిర్వహించి అందులో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. రోహిత్ శర్మ పెర్త్ టెస్టు ఆడకపోతే అతని స్థానంలో ఇన్నింగ్స్‌ను ఎవరు ప్రారంభిస్తారో గంభీర్ స్పష్టం చేశాడు. ఇది మాత్రమే కాదు, రోహిత్ గైర్హాజరీలో, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పెర్త్ టెస్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోహిత్ శర్మ మిస్సింగ్‌పై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. “ప్రస్తుతానికి, ఎటువంటి నిర్ధారణ లేదు. కానీ, మేం పూర్తి పరిస్థితిని త్వరలోనే తెలియజేస్తాం. అతను అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాం. అయితే, సిరీస్ ప్రారంభంలోనే మాకు ప్రతిదీ తెలుస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.
రోహిత్ స్థానంలో ఎవరు ఓపెనర్ అవుతారు?
ఒకవేళ రోహిత్ లేకపోతే యశస్వి జైస్వాల్‌తో ఎవరు ఓపెనింగ్ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి గంభీర్ మాట్లాడుతూ, “అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్ ఉన్నారు. కాబట్టి రోహిత్ అందుబాటులో లేకపోతే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాం. ఎంపికలు చాలానే ఉన్నాయి” అంటూ తెలిపాడు.
ఆస్ట్రేలియా Aతో జరిగిన రెండవ అనధికార టెస్ట్‌ల్లో కేఎల్ రాహుల్, అభిమన్యు భారత్ A తరపున ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఇద్దరూ తక్కువ స్కోర్లు చేశారు. ఆ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ ఆడిన అభిమన్యు రెండు ఇన్నింగ్స్‌లలో 7, 12, 0, 17 పరుగులు చేయగా, రాహుల్ తన ఏకైక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 4, 10 పరుగులు చేశాడు. తాజా పరిణామాలకు ముందు, రాహుల్ టెస్ట్‌లలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే, రోహిత్ తప్పుకోవడం అతనిని మళ్లీ ఆర్డర్‌లో అగ్రస్థానంలో పోటీదారుగా చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




