Team India: ‘ఆ ఇద్దరు టెస్టుల్లో టీమిండియాకు బ్యాడ్‌‌లక్..’ తెగేసి తెగదెంపులు చేసుకున్న బీసీసీఐ

కింగ్‌ కోహ్లీ, హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ. ఇద్దరు ఒకేసారి వైదొలగడం అనేది భారత క్రికెట్‌ అభిమానులను బాధిస్తోంది. ఐదు రోజుల గ్యాప్‌లో వీళ్లిద్దరూ ఇచ్చిన షాక్‌కు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు ఫ్యాన్స్‌. అయితే వీళ్ల రిటైర్మెంట్‌ వెనుక ఉన్నదెవరు? ఎవరి ఒత్తిడి కారణంగా ఇలాంటి షాకింగ్‌ నిర్ణయాన్ని ప్రకటించారు?

Team India: ఆ ఇద్దరు టెస్టుల్లో టీమిండియాకు బ్యాడ్‌‌లక్.. తెగేసి తెగదెంపులు చేసుకున్న బీసీసీఐ
Gambhir, Rohit Sharma, Vira

Updated on: May 14, 2025 | 9:28 PM

మే 7… రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్న రోజు. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతూ తన నిర్ణయాన్ని వెల్లడించాడు భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ. మే 12.. సరిగ్గా ఐదు రోజుల తర్వాత విరాట్‌ కోహ్లీ సంచలన వార్తతో అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. రోహిత్‌ శర్మ బాటలోనే నడుస్తూ టెస్టులకు ఇక సెలవంటూ ప్రకటించాడు కోహ్లీ. ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు టెస్టులకు గుడ్‌బై చెప్పడం భారత క్రికెట్‌ అభిమానులకు మింగుడు పడలేదు. రోహిత్‌ వైదొలగుతాడని అంతా భావించారు కాని కోహ్లీ రిటైర్మెంట్‌ షాకే అని చెప్పాలి. పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో మంచి పరుగులు సాధిస్తున్నాడు. ఎంతో స్ఫూర్తితో కనిపించాడు. ఇంతలోనే టెస్టులకు గుడ్‌బై చెప్పడం షాకింగే. అయితే వీరిద్దరి నిర్ణయం వెనుక ఉన్నది ఎవరు? కోహ్లీ రిటైర్ అవుతానని చెప్తే బీసీసీఐ వద్దు అన్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. కాని అది నిజం కాదు బీసీసీఐ పెద్దలే కోహ్లీతో బలవంతంగా వైదొలగేలా చేశారనేది లేటెస్టుగా బయటకు వస్తున్న వార్త.

భారత కోచ్‌ గౌతం గంభీర్‌ బీసీసీఐకి తెగేసి చెప్పేశాడు. టెస్టుల్లో మనం విజయాలు సాధించాలంటే జట్టుపై తనకు పూర్తి కంట్రోల్‌ ఉండాలని వెల్లడించాడు. అంతేకాదు ఆ ఇద్దరు జట్టుకు భారంగా మారినట్లు కూడా బీసీసీఐ చెప్పాడు గంభీర్‌. రోహిత్‌ , కోహ్లీల రీసెంట్‌ పెర్ఫామెన్స్‌పై డీటెయిల్డ్‌ రిపోర్టు సెలెక్టర్ల ముందు ఉంచి వీరిని ఎందుకు ఆడించాలో చెప్పాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరిలో మునుపటి పటుత్వం లేదని.. ఆటలో చాలా లోపాలున్నట్లు చెప్పేశాడు గంభీర్‌. దీని వల్లే బీసీసీఐ పెద్దలు రోహిత్‌, కోహ్లీలకు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. టీమ్‌లో మిమ్మల్ని ఏ స్థానంలో ఆడించాలో తెలియడంలేదని బోర్డు మెంబర్లు వారికి చెప్పారని.. దీంతో వారే అర్ధం చేసుకుని టెస్టులకు గుడ్‌ బై చెప్పారనేది బయటికొస్తున్న న్యూస్‌.

ఇవి కూడా చదవండి

టెస్టుల్లో పదివేల మైలు రాయి అనేది అందరికీ విలువైనదే. కోహ్లీ మరో ఎనిమిది వందల పరుగులు చేస్తే ఆ గోల్‌ను రీచ్‌ అవుతాడు. అంతేకాదు మరో రెండేళ్లు టెస్టులు, వన్డేలు ఆడి వైదొలుగుదామన్న ప్లాన్‌లో ఉన్నాడు కోహ్లీ. కాని బీసీసీఐ పెద్దలు మరోటి తలచారు. అతడిపై ఒత్తిడి తీసుకొచ్చి రిటైర్మెంట్‌ ప్రకటించేలా చేశారు. వీళ్లిద్దరు ఇప్పుడు రిటైర్‌ కావడంతో వారి స్థానంలో ఎవర్ని తీసుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది.