విరాట్ నుంచి ధావన్ వరకు.. ఈ స్టార్ ప్లేయర్ల ముద్దుపేర్లు తెలుసా? వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీలు ఇవే..

|

Jan 03, 2023 | 2:26 PM

క్రికెట్‌లో కొంతమంది ఆటగాళ్లను మైదానంలో, మైదానం వెలుపల వేర్వేరు పేర్లతో పిలవడం మనం తరచుగా చూస్తేనే ఉన్నాం. దీని వెనుక చాలా ఆసక్తికరమైన కథనాలు ఉంటాయి. ముఖ్యంగా టీమిండియాలో ఇలాంటి ప్లేయర్లు చాలామందే ఉన్నారు.

విరాట్ నుంచి ధావన్ వరకు.. ఈ స్టార్ ప్లేయర్ల ముద్దుపేర్లు తెలుసా? వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీలు ఇవే..
Team India Players
Follow us on

క్రికెట్‌లో కొంతమంది ఆటగాళ్లను మైదానంలో, మైదానం వెలుపల వేర్వేరు పేర్లతో పిలవడం మనం తరచుగా చూస్తేనే ఉన్నాం. దీని వెనుక చాలా ఆసక్తికరమైన కథనాలు ఉంటాయి. ముఖ్యంగా టీమిండియాలో ఇలాంటి ప్లేయర్లు చాలామందే ఉన్నారు. కొన్నిసార్లు ఇలాంటి పేర్లను వాళ్ల సొంత కోరికతో పిలస్తుండగా, మరికొన్నిసార్లు వారు వారి ఇష్టానికి వ్యతిరేకంగా కూడా మారుపేర్లను పొందుతారు. ఉదాహరణకు, రాహుల్ ద్రవిడ్‌ని క్రికెట్ ప్రపంచంలో ‘ది వాల్’, ‘మిస్టర్ ట్రస్ట్‌వర్తీ’ అని పిలుస్తారు. కానీ, అతని సహచరులు అతనికి జామీ అని ముద్దుగా పేరు పెట్టారు. నిజానికి ద్రవిడ్ ఒక జామ్ గురించి ప్రచారం చేసేవాడు. దాంతో అప్పటి నుంచి అతని తోటి ఆటగాళ్ళు ద్రవిడ్‌ను జామీ అని పేరు పెట్టారు. అలాంటి ముగ్గురు ఆటగాళ్ల నిక్ నేమ్‌లు, వాటి వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. విరాట్ కోహ్లీ..

క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. టీమిండియా ఈ గొప్ప ఆటగాడిని ‘చీకూ’ పేరుతో పిలుస్తుంటారు. ఈ పేరు వెనుక ఉన్న కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి ఈ పేరు విరాట్ కోహ్లీకి ఢిల్లీ, ముంబై మధ్య జరిగిన రంజీ మ్యాచ్ సమయంలో పెట్టారు.

విరాట్ కోహ్లీ అప్పుడే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఎప్పటిలాగే దూకుడుగా, ఉత్సాహంగా ఉన్నాడు. అయితే ఆ రోజు విరాట్ ఉత్సాహానికి మరో కారణం కూడా ఉంది. విరాట్ కొత్త హెయిర్ స్టైల్‌తో ఆరోజు కనిపించాడు. స్పైక్డ్ హెయిర్, పొడవాటి చెవులు, ఉబ్బిన ముఖంతోపాటు కొత్త హెయిర్ కట్‌తో, విరాట్ ఫీల్డ్‌లోకి ప్రవేశించాడు. అప్పుడు కోచ్ అజిత్ చౌదరీకి చంపక్ కామిక్ నుంచి చీకు కుందేలులా కనిపించాడంట. ఆ కారణంగా అజిత్ విరాట్‌ను చీకూ పేరుతో పిలిచాడు. అప్పటి నుంచి విరాట్ పేరు చీకుగా మారింది.

ఇవి కూడా చదవండి

2. రోహిత్ శర్మ..

ఫామ్‌లో ఉన్నప్పుడు తన ప్రత్యర్థులపై భారీగా విరుచుకపడే భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. అతను తన బలమైన, దూకుడు బ్యాటింగ్‌తో చుక్కలు చూపిస్తుంటాడు. హిట్‌మ్యాన్ పేరుతో రోహిత్ శర్మను పిలుస్తారనే విషయం తెలిసిందే. అసలు అదేలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం..

2013లో ఆస్ట్రేలియాపై రెండో డబుల్ సెంచరీ చేసిన తర్వాత, రోహిత్ చాలా ప్రశంసలు అందుకున్నాడు. ఆసమయంలోనే రోహిత్ శర్మకు కొత్త పేరు కూడా వచ్చింది. అదే హిట్‌మ్యాన్. ఇప్పుడు చాలా మంది క్రీడా ప్రేమికులకు రోహిత్ ఈ పేరుతోనే పిలుస్తుంటారు.

3. శిఖర్ ధావన్..

భారత జట్టులోని ఆటగాళ్లలో శిఖర్ ధావన్ శైలి ఎంతో ప్రత్యేకమైంది. అతని మీసాలు స్టైల్ స్టేట్‌మెంట్‌గా మారాయి. శిఖర్‌ని అతని సహచరులు గబ్బర్ అని పిలుస్తారు. ఈ పేరు వెనుక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

షోలేలోని గబ్బర్‌ పేరు మీరు వినే ఉంటారు. నిజానికి, ధావన్ ఒకప్పుడు దేశవాళీ మ్యాచ్‌లు ఆడే సమయంలో, ఫీల్డింగ్ చేసేటప్పుడు తన జట్టులో మనోధైర్యాన్ని పెంచడానికి గబ్బర్ డైలాగ్‌లను ఉపయోగించేవాడు. క్రమంగా ఇది అతనికి అలవాటుగా మారింది. అందుకే అతనికి గబ్బర్ అనే పేరు వచ్చింది. ధావన్ స్నేహితులు కొందరు అతన్ని జట్జీ అని కూడా పిలుస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..