Team India: అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు.. లిస్టులో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు.. ఎవరంటే?

ఇప్పటి వరకు టెస్టు క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్‌లు చాలా మందే ఉన్నారు. వీరంతా పరుగుల వర్షం కురిపించారు. దిగ్గజ బౌలర్ల ముందు పరుగులు సాధించి, రికార్డులకు ఎక్కారు. టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే బ్యాట్స్‌మెన్ చాలా ఓపికతో ఆడాల్సి ఉంటుంది. టెస్ట్ క్రికెట్‌ని నిజమైన క్రికెట్ అని పిలవడానికి కారణం ఇదే.

Team India: అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు.. లిస్టులో ముగ్గురు టీమిండియా క్రికెటర్లు.. ఎవరంటే?
Team India

Updated on: Jun 07, 2023 | 6:59 AM

ఇప్పటి వరకు టెస్టు క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్‌లు చాలా మందే ఉన్నారు. వీరంతా పరుగుల వర్షం కురిపించారు. దిగ్గజ బౌలర్ల ముందు పరుగులు సాధించి, రికార్డులకు ఎక్కారు. టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే బ్యాట్స్‌మెన్ చాలా ఓపికతో ఆడాల్సి ఉంటుంది. టెస్ట్ క్రికెట్‌ని నిజమైన క్రికెట్ అని పిలవడానికి కారణం ఇదే. ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్‌లు గంటల తరబడి క్రీజులో నిలిచినా.. పరుగులు రాకపోయినా.. బంతిని డిఫెండ్ చేసే కళ తప్పక తెలియాల్సి ఉంటుంది.

టెస్టు క్రికెట్‌లో ఇప్పటివరకు బ్యాట్స్‌మెన్‌లు ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి పరుగుల వర్షం కురిపించారు. కానీ, ఒక ఆటగాడు తన అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటాడు. అది అతనికి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ అవుతుంది. ఇప్పటి వరకు అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ ఘనత సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితా చాలా పెద్దదే. అయితే ఈ రోజు మనం తమ అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 3 భారత బ్యాట్స్‌మెన్స్ గురించి తెలుసుకుందాం..

అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్స్..

3. లాలా అమర్‌నాథ్: ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు లాలా అమర్‌నాథ్ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 1933 డిసెంబర్ 15న ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో లాలా అమర్‌నాథ్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 156 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేసి అద్భుతమైన సెంచరీ సాధించాడు. లాలా అమర్‌నాథ్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 24 మ్యాచ్‌లు ఆడి 878 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

2. రోహిత్ శర్మ: ఈ జాబితాలో భారత క్రికెట్‌ జట్టు వెటరన్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 6 నవంబర్ 2013న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీని సాధించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 177 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 39 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు, 66 ఇన్నింగ్స్‌లలో 2679 పరుగులు చేశాడు. రోహిత్ అత్యధిక స్కోరు 212 పరుగులు.

1. శిఖర్ ధావన్: భారత్ తరపున అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శిఖర్ ధావన్ రికార్డు సృష్టించాడు. ధావన్ 14 మార్చి 2013న మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధావన్ 187 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శిఖర్ ధావన్ ఇప్పటివరకు మొత్తం 34 మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సహాయంతో 2315 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..