ODI Records: ఓ వన్డే ఇన్నింగ్స్‌లో బౌండరీ వర్షం.. ఫోర్లు, సిక్సర్లతో అత్యధిక పరుగులు.. లిస్టులో ఐదుగురు.. మనోడే టాప్

ODI Records: చాలా మంది తుఫాన్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. వారు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ బ్యాట్స్‌మెన్స్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాబట్టి వన్డే క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్స్‌లతో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ODI Records: ఓ వన్డే ఇన్నింగ్స్‌లో బౌండరీ వర్షం.. ఫోర్లు, సిక్సర్లతో అత్యధిక పరుగులు.. లిస్టులో ఐదుగురు.. మనోడే టాప్
Team India

Updated on: Jan 17, 2024 | 3:27 PM

ODI Innings: టీ20 క్రికెట్ ఆవిష్కరణతో టెస్ట్‌లే కాదు, వన్డేలు ఇలా ప్రతి ఫార్మాట్ ఆటలో మార్పు వచ్చింది. చాలా మంది ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లలో వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించడం ప్రారంభించారు. ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో చాలా మంది బ్యాట్స్‌మెన్స్ ఆరంభం నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో, చాలా మంది బ్యాట్స్‌మెన్స్ తమ ఇన్నింగ్స్‌లో నిరంతరం ఫోర్లు, సిక్సర్లు కొడుతూనే ఉంటారు.

చాలా మంది తుఫాన్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. వారు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ బ్యాట్స్‌మెన్స్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం కలిగి ఉన్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. కాబట్టి వన్డే క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్స్‌లతో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఒక వన్డే ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్లతో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్స్..

 

5. రోహిత్ శర్మ..

ఈ జాబితాలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో స్థానంలో ఉన్నాడు. అతను 2 నవంబర్ 2013న బెంగళూరులో ఆస్ట్రేలియాపై అద్భుతమైన డబుల్ సెంచరీని సాధించాడు. రోహిత్ 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ 12 ఫోర్లు, 16 సిక్సర్లు బాది ఫోర్లు, సిక్సర్లతో మొత్తం 144 పరుగులు చేశాడు.

4. షేన్ వాట్సన్..

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షేన్ వాట్సన్ 11 ఏప్రిల్ 2011న ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 96 బంతుల్లో 185 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో, వాట్సన్ 15 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో మొత్తం 150 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

3. ఇషాన్ కిషన్..

ఈ జాబితాలో భారత యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషన్‌ మూడో స్థానంలో నిలిచాడు. అతను 10 డిసెంబర్ 2022న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 169 బంతుల్లో 210 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో, ఇషాన్ కిషన్ 24 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టి ఫోర్లు, సిక్సర్లతో 156 పరుగులు చేశాడు.

2. మార్టిన్ గప్టిల్..

న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ప్రపంచకప్ 2015లో వెస్టిండీస్‌పై 237 పరుగులతో అజేయంగా మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 163 బంతుల్లోనే సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో గప్టిల్ 24 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టి ఫోర్లు, సిక్సర్లతో మొత్తం 162 పరుగులు చేశాడు.

1. రోహిత్ శర్మ..

13 నవంబర్ 2014న కోల్‌కతాలో శ్రీలంకపై రోహిత్ శర్మ 264 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద స్కోరు. రోహిత్ తన ఇన్నింగ్స్‌లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు కొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో మొత్తం 186 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..