
3 Uncapped Indian Players Performances: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఎల్లప్పుడూ యువతకు చాలా ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఐపీఎల్ ద్వారా భారత్‌కు ప్రతి సంవత్సరం ఎంతో మంది అద్భుతమైన యువ ఆటగాళ్లు లభిస్తున్నారు. యువతను వారి గమ్యస్థానానికి తీసుకెళ్లడంలో IPL ముఖ్యమైన సహకారం అందిస్తుంది. ఈ ఏడాది కూడా చాలా మంది అన్ క్యాప్ భారత బ్యాట్స్ మెన్స్ తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ ఆటగాళ్లు నిర్భయతను ప్రదర్శించి ప్రస్తుత సీజన్‌లో జట్టు కోసం ఎన్నో ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. IPL 2024లో, అన్ని జట్లు కూడా యువతకు చాలా అవకాశాలను అందించాయి. యువ ఆటగాళ్లు కూడా ఈ అవకాశాలను బాగా ఉపయోగించుకున్నారు. యువ ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనల మధ్య, లీగ్‌లో ఇప్పటివరకు అద్భుతంగా ఆడిన ముగ్గురు అన్‌క్యాప్డ్ భారత బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్ అశుతోష్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. జట్టు తరుపున మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అశుతోష్ చాలాసార్లు క్లిష్ట పరిస్థితుల నుంచి జట్టును గట్టెక్కించి విజయతీరాలకు చేర్చాడు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌పై అతని ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అశుతోష్ బ్యాట్‌తో చెలరేగి 28 బంతుల్లో 61 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్‌ను గెలిపించలేకపోయినప్పటికీ, అతని ఇన్నింగ్స్ అందరి హృదయాలను గెలుచుకుంది. ఐపీఎల్ 2024లో అశుతోష్ 10 మ్యాచ్‌ల్లో 1 హాఫ్ సెంచరీ సాయంతో 187 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. జట్టుకు శుభారంభం ఇవ్వడంతో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్‌తో అభిషేక్ జోడీ IPL 2024లో అత్యంత తుఫాను, సూపర్‌హిట్ జోడీగా నిరూపితమైంది. అభిషేక్ శర్మ 12 మ్యాచ్‌ల్లో 2 అర్ధ సెంచరీల సాయంతో 401 పరుగులు చేశాడు. అతను ముంబై ఇండియన్స్‌పై 23 బంతుల్లో 63 పరుగుల చిరస్మరణీయమైన తుఫాను ఇన్నింగ్స్ కూడా ఆడాడు.
రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆల్ రౌండర్ ర్యాన్ పరాగ్ ఐపీఎల్ 2024లో తన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌కు బదులుగా 4వ నంబర్‌లో బ్యాటింగ్‌కు ప్రమోట్ అయిన పరాగ్, చాలా మ్యాచ్‌లలో జట్టును క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించాడు. రాజస్థాన్ తరపున అతను చాలా మ్యాచ్‌ల్లో ఇంటెలిజెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్ 2024లో రియాన్ పరాగ్ 13 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీల సాయంతో 531 పరుగులు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..