మైదానంలో వీళ్ల కంటే తోపులు లేరు.. అడుగు వేయాలంటే 100 సార్లు థింక్ చేయాల్సిందే భయ్యో

Unique Cricket Records: ఈ దిగ్గజ ఫీల్డర్లు ఫీల్డింగ్ కోసం క్రికెట్ మైదానంలో నిలబడితే, ఎదురు నిలవడం కష్టమే. ప్రత్యర్థి జట్టు బ్యాటర్స్ చాలా అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రనౌట్‌లు చేసిన ఆ ఐదుగురు ఫీల్డర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మైదానంలో వీళ్ల కంటే తోపులు లేరు.. అడుగు వేయాలంటే 100 సార్లు థింక్ చేయాల్సిందే భయ్యో
Unique Cricket Records

Updated on: Aug 30, 2025 | 10:28 AM

Unique Cricket Records: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు ఫీల్డర్లు ఉన్నారు. వీరి రికార్డులు ప్రపంచ క్రికెట్‌కే దడ పుట్టించాయని తెలుసా..? ఈ దిగ్గజ ఫీల్డర్లు ఫీల్డింగ్ కోసం క్రికెట్ మైదానంలో నిలబడినప్పుడు, ప్రత్యర్థి జట్టు బ్యాటర్స్ చాలా అప్రమత్తంగా ఉండాల్సి వచ్చేది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రనౌట్‌లు చేసిన ఆ ఐదుగురు ఫీల్డర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 80 రనౌట్‌లు చేశాడు. ఇది ప్రపంచ రికార్డు. రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 27,483 పరుగులు చేశాడు. ఇందులో 71 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2. జాంటీ రోడ్స్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 68 రనౌట్లు చేశాడు. జాంటీ రోడ్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 8467 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 50 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

3. సనత్ జయసూర్య (శ్రీలంక): శ్రీలంక వెటరన్ క్రికెటర్ సనత్ జయసూర్య అంతర్జాతీయ క్రికెట్‌లో 63 రనౌట్‌లు చేశాడు. సనత్ జయసూర్య అంతర్జాతీయ క్రికెట్‌లో 21032 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు, 103 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

4. తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక): శ్రీలంక వెటరన్ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 57 రనౌట్‌లు చేశాడు. తిలకరత్నే దిల్షాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 17,671 పరుగులు చేశాడు. ఇందులో 39 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

5. స్టీవ్ వా (ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా అంతర్జాతీయ క్రికెట్‌లో 48 రనౌట్లు చేశాడు. స్టీవ్ వా అంతర్జాతీయ క్రికెట్‌లో 18,496 పరుగులు చేశాడు. ఇందులో 35 సెంచరీలు, 95 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

6. యువరాజ్ సింగ్ (భారతదేశం): భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 46 రనౌట్లు చేశాడు. యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 11,778 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 71 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

7. హెర్షెల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్షెల్ గిబ్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 43 రనౌట్లు చేసి ఈ జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. హెర్షెల్ గిబ్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 14661 పరుగులు చేశాడు. ఇందులో 35 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..