
Strongest Batting Teams in IPL 2025: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత హై ప్రొఫైల్ టీ20 లీగ్ ఐపీఎల్ 18వ ఎడిషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ బ్లాక్‌బస్టర్ టీ20 లీగ్ ఉత్సాహం మార్చి 22 నుంచి మొత్తం క్రికెట్ ప్రపంచం అంతటా వ్యాపించబోతోంది. ఇందుకోసం ఈ టోర్నమెంట్‌లోని 10 జట్లు సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఐపీఎల్ 2025లో కొన్ని జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి.
ఈసారి ఈ టీ20 లీగ్‌లో, కొన్ని జట్ల బ్యాటింగ్ లైనప్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. వీరిలో చాలా మంది తెలివైన బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఆ బ్యాట్స్‌మెన్‌ల ఆధారంగా ఐపీఎల్ 2025 కోసం అత్యంత బలమైన, అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న 3 జట్లను ఓసారి చూద్దాం..
ఐపీఎల్ 2022 లో అడుగుపెడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఈసారి చాలా మార్పులు జరిగాయి. జట్టులో కెప్టెన్సీ నుంచి ఆటగాళ్ల వరకు చాలా మార్పులు జరిగాయి. రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో జట్టు అద్భుతమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ జట్టులో ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్ ఓపెనింగ్ చేయవచ్చు. ఆ తర్వాత రిషబ్ పంత్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్ వంటి అద్భుతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఇది కాకుండా, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, మాథ్యూ బ్రీట్జ్కే వంటి గొప్ప బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు.
ఐపీఎల్ చివరి సీజన్ అంటే 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్‌లో మరికొంతమంది ప్రమాదకరమైన పేర్లు చేరాయి. దీంతో ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ చాలా ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి ప్రమాదకరమైన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఆ తరువాత ఆర్డర్‌లో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసేన్, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్, అర్థవ్ తైడే ఉన్నారు. కమిందు మెండిస్, వియాన్ ముల్డర్, సచిన్ బేబీ కూడా ఉన్నారు. దీని వల్ల బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తుంది.
ఐపీఎల్ 2025 జట్లను పరిశీలిస్తే, ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అత్యంత ప్రమాదకరమైనదిగా కనిపిస్తుంది. ఈ జట్టులో చాలా మంది ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఇది జట్టుపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ముంబై బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్ శర్మతో పాటు ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ ఉన్నారు. ఆ తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నారు. వీరితో పాటు, డెవాన్ జాకబ్స్, నమన్ ధీర్, రాబిన్ మింజ్, రాజ్ అంగద్ బావా, మిచెల్ సాంట్నర్ కూడా బ్యాటింగ్ చేయనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..