Mohammed Siraj In IPL 2023: ఐపీఎల్ 2023లో RCB ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు అద్భుతమైన రిథమ్‌లో కనిపించాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 14 వికెట్లు తీశాడు. ప్రస్తుతం సిరాజ్ ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసి నంబర్‌వన్‌లో ఉన్నాడు. ఇక రషీద్ ఖాన్ 14 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇది కాకుండా, సిరాజ్ ఇప్పటివరకు టోర్నీలో గరిష్టంగా 100 డాట్ బాల్స్ విసిరి సెంచరీని పూర్తి చేశాడు.
ఐపీఎల్ 2023లో మొహమ్మద్ సిరాజ్ ఇప్పటివరకు మొత్తం 32 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో అతను 100 డాట్ బాల్స్ వేశాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పటి వరకు 27 ఓవర్లలో మొత్తం 88 డాట్ బాల్స్ వేశాడు. ఇది కాకుండా అర్ష్‌దీప్ సింగ్ 69 డాట్ బాల్స్‌తో మూడో స్థానంలో, వరుణ్ చక్రవర్తి 69 డాట్ బాల్స్‌తో నాలుగో స్థానంలో, భువనేశ్వర్ కుమార్ 67 డాట్ బాల్స్‌తో ఐదో స్థానంలో ఉన్నారు.
మహ్మద్ సిరాజ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 100 (32 ఓవర్లు)
మహ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్) – 95 (31 ఓవర్లు)
అర్ష్దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్) – 69 (29 ఓవర్లు)
వరుణ్ చక్రవర్తి (కేకేఆర్) – 74 (33.4 ఓవర్లు)
భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – 71 (27 ఓవర్లు)
మరోవైపు, మహ్మద్ సిరాజ్ గురించి చెప్పాలంటే, అతను ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తూ 16.64 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 7.28, బౌలింగ్ స్ట్రైక్ రేట్ 13.71గా నిలిచింది.
మహ్మద్ సిరాజ్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 73 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తూ 29.92 సగటుతో మొత్తం 73 వికెట్లు పడగొట్టాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 8.59గా ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..