Asia Cup 2023: 7సార్లు ఆసియా కప్‌లను అందించిన భారత కెప్టెన్లు వీరే.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?

Team India Captains: ఆసియా కప్ 2023 ఈనెల 30 నుంచి మొదలుకానుంది. కాగా, భారత జట్టు ఇప్పటివరకు అత్యధికంగా 7 సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. భారత జట్టుకు అత్యధిక టైటిళ్లను అందించిన కెప్టెన్ ఎవరో మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Asia Cup 2023: 7సార్లు ఆసియా కప్‌లను అందించిన భారత కెప్టెన్లు వీరే.. అగ్రస్థానంలో ఎవరున్నారంటే?
Asia Cup 2023 Ind Vs Pak

Updated on: Aug 19, 2023 | 12:50 PM

ఆసియా కప్ 2023 ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి టోర్నీ వన్డే ఫార్మాట్‌లో జరగనుంది. అంతకుముందు 2022లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో శ్రీలంక టైటిల్‌ను గెలుచుకుంది. భారత జట్టు చివరిసారిగా 2018లో ఆసియా కప్‌ను గెలుచుకుంది. అదే సమయంలో 1984లో ఆడిన తొలి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకోవడంలో భారత్ విజయం సాధించింది.

వెటరన్‌ సునీల్‌ గవాస్కర్‌ సారథ్యంలో భారత జట్టు తొలి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత్ తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అదే సమయంలో 2018లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో జట్టు చివరి టైటిల్ వచ్చింది. ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను 3 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. ఆసియా కప్‌ను భారత్ ఏ ఆటగాళ్ల కెప్టెన్సీలో గెలుచుకుందో ఓసారి తెలుసుకుందాం..

భారత్‌కు ఆసియా కప్ అందించిన కెప్టెన్స్..

సునీల్ గవాస్కర్ – 1984

ఇవి కూడా చదవండి

దిలీప్ వెంగ్‌సర్కార్ – 1988

మహ్మద్ అజారుద్దీన్ – 1991

మహ్మద్ అజారుద్దీన్ – 1995

మహేంద్ర సింగ్ ధోని – 2010

మహేంద్ర సింగ్ ధోని – 2010

రోహిత్ శర్మ – 2018

ఇప్పటి వరకు మహ్మద్ అజహరుద్దీన్, ఎంఎస్ ధోనీ మాత్రమే భారతదేశానికి రెండుసార్లు ఆసియా కప్ టైటిల్‌ను అందించిన కెప్టెన్లుగా నిలిచారు. కాగా, ఈ ఏడాది రోహిత్ శర్మ కూడా కెప్టెన్‌గా రెండో ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. అతని కెప్టెన్సీలో టీమిండియా రెండవ ఆసియా కప్‌ను గెలవగలడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..