IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టెస్టులో తోపు బౌలర్లు వీళ్లే.. బ్యాటర్లను భయపెట్టిన టాప్ 5 లిస్ట్‌లో ఎవరున్నారంటే?

IND vs ENG Test Series: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జనవరి 26 నుంచి మొదలుకానుంది. అటు బ్యాట్, ఇటు బాల్‌తో చాలా వాడీ, వేడీ యుద్దం జరగనుంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ భారత జట్టు మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్‌లో ఇంగ్లీష్ జట్టుతో తలపడుతుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో విధ్వంసం సృష్టించిన ఐదుగురు బౌలర్లు ఉన్నారు.

IND vs ENG: భారత్-ఇంగ్లండ్ టెస్టులో తోపు బౌలర్లు వీళ్లే.. బ్యాటర్లను భయపెట్టిన టాప్ 5 లిస్ట్‌లో ఎవరున్నారంటే?
Ind Vs Eng Test Series

Updated on: Jan 21, 2024 | 2:30 PM

IND vs ENG Test Series: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జనవరి 26 నుంచి మొదలుకానుంది. అటు బ్యాట్, ఇటు బాల్‌తో చాలా వాడీ, వేడీ యుద్దం జరగనుంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జనవరి 25 నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ భారత జట్టు మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్‌లో ఇంగ్లీష్ జట్టుతో తలపడుతుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఇప్పటివరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో విధ్వంసం సృష్టించిన ఐదుగురు బౌలర్లు ఉన్నారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరో ఓసారి చూద్దాం..

ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్‌లో భారత్‌పై అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. జేమ్స్ అండర్సన్ ఇప్పటివరకు భారత్‌తో 35 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 24.89 బౌలింగ్ సగటుతో 139 వికెట్లు తీశాడు. భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో జేమ్స్ అండర్సన్ 6 సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో జేమ్స్ అండర్సన్ 690 వికెట్లు తీశాడు.

భారత మాజీ లెగ్ స్పిన్నర్ భగవత్ చంద్రశేఖర్ ఇంగ్లండ్‌తో 23 టెస్టు మ్యాచ్‌లు ఆడి 27.27 సగటుతో 95 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌పై భగవత్ చంద్రశేఖర్ 107 పరుగులకు 9 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. భగవత్ చంద్రశేఖర్ భారత్ తరపున 58 టెస్టు మ్యాచ్‌లు ఆడి 242 వికెట్లు తీశాడు.

భారత మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఇంగ్లండ్‌తో 19 టెస్టు మ్యాచ్‌లు ఆడి 30.59 సగటుతో 92 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరపున అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో, అనిల్ కుంబ్లే 35 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్‌లో 8 సార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు.

ఈ జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్‌తో 19 టెస్టు మ్యాచ్‌లు ఆడి 28.59 సగటుతో 88 వికెట్లు తీశాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ భారత్‌ తరపున 95 టెస్టులాడి 490 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ 34 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్‌లో 8 సార్లు 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు.

బిషన్ సింగ్ బేడీ ఇంగ్లండ్‌తో 22 టెస్టు మ్యాచ్‌లు ఆడి 29.87 సగటుతో 85 వికెట్లు పడగొట్టాడు. బిషన్ సింగ్ బేడీ భారత్ తరపున 67 టెస్టు మ్యాచ్‌లు ఆడి 266 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో బిషన్ సింగ్ బేడీ 14 సార్లు ఐదు వికెట్లు, ఒకసారి మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..