T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో 8 భారీ సెంచరీలు.. నంబర్ వన్ ప్లేస్ ఎవరిదో తెలుసా?

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026 కోసం రంగం సిద్ధమైంది. ఇప్పటికే అన్ని జట్లు తమ సన్నాహాలు పూర్తి చేశాయి. ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న ఈ ఐసీసీ మెగా ఈవెంట్ కోసం భారత్, శ్రీలంక దేశాలు సర్వం సిద్ధం చేశాయి.

T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో 8 భారీ సెంచరీలు.. నంబర్ వన్ ప్లేస్ ఎవరిదో తెలుసా?
T20 World Cup

Updated on: Feb 01, 2026 | 12:04 PM

T20 World Cup: 2026 టీ20 ప్రపంచ కప్ కోసం రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో 20 జట్లు టైటిల్ కోసం పోటీపడతాయి. మొదటి టీ20 ప్రపంచ కప్ 2007లో జరిగింది. అప్పటి నుంచి ఈ టోర్నమెంట్‌లో 11 సెంచరీలు నమోదయ్యాయి.

  1. బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్): 2012 టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై 58 బంతుల్లో 123 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 6 సిక్సర్లతో ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్ పల్లికల్‌లో జరిగింది.
  2. క్రిస్ గేల్ (వెస్టిండీస్): 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాపై ఎడమచేతి వాటం ఓపెనర్ క్రిస్ గేల్ 57 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ జోహన్నెస్‌బర్గ్‌లో జరిగింది.
  3. అలెక్స్ హేల్స్ (ఇంగ్లాండ్): ఈ డాషింగ్ ఇంగ్లాండ్ ఓపెనర్ 2014లో శ్రీలంకపై 64 బంతుల్లో అజేయంగా 116 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ చట్టోగ్రామ్‌లో జరిగింది.
  4. అహ్మద్ షెహజాద్ (పాకిస్తాన్): 2014లో మీర్పూర్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెహజాద్ 62 బంతుల్లో అజేయంగా 111 పరుగులు చేశాడు.
  5. రిలే రస్సో (దక్షిణాఫ్రికా): సిడ్నీలో జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్రికన్ జట్టుకు చెందిన ఈ స్టార్ బ్యాట్స్‌మన్ 56 బంతుల్లో 109 పరుగులు చేశాడు.
  6. గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్): సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంకపై స్టార్ కివీస్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ 64 బంతుల్లో 104 పరుగులు చేశాడు.
  7. తమీమ్ ఇక్బాల్ (బంగ్లాదేశ్): 2016లో ధర్మశాలలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో ఓమన్‌పై బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ 63 బంతుల్లో అజేయంగా 103 పరుగులు చేశాడు.
  8. జోస్ బట్లర్ (ఇంగ్లండ్): సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంకపై స్టార్ కివీస్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్ 64 బంతుల్లో 104 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..