‘అలెక్సా’కే పిచ్చెక్కించిన జనాలు.. కోహ్లీ గురించి ఏం అడిగారో తెలుసా..? ఇలా ఉన్నారేంట్రా..

స్మార్ట్ స్పీకర్లు ఇప్పుడు మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలా మారిపోయాయి. 2025లో భారతీయ వినియోగదారులు తమ 'అలెక్సా'తో జరిపిన సంభాషణలపై అమెజాన్ ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది. కే-పాప్ (K-pop) సంగీతం నుంచి భయంకరమైన క్రైమ్ పాడ్‌కాస్ట్‌ల వరకు, బాలీవుడ్ గాసిప్స్ నుంచి ఆధ్యాత్మిక విషయాల వరకు భారతీయుల అభిరుచులు ఎలా మారుతున్నాయో ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

అలెక్సాకే పిచ్చెక్కించిన జనాలు.. కోహ్లీ గురించి ఏం అడిగారో తెలుసా..? ఇలా ఉన్నారేంట్రా..
Alexa Virat Kohli

Updated on: Jan 01, 2026 | 11:22 AM

Alexa India 2025 Report: 2025 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో, అమెజాన్ ఇండియా తన వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది భారతీయులు ఇంగ్లీష్, హిందీ, హింగ్లీష్ (Hinglish) భాషల్లో అలెక్సాను అడిగిన ప్రశ్నలు మన దేశం మారుతున్న వినోదపు అలవాట్లను ప్రతిబింబిస్తున్నాయి.

మ్యూజిక్ ట్రెండ్స్: కే-పాప్, బాలీవుడ్ హంగామా..

ఈ ఏడాది సంగీతం విషయంలో భారతీయులు గ్లోబల్ ట్రెండ్స్‌ను విపరీతంగా ఫాలో అయ్యారు. ముఖ్యంగా కొరియన్ సంగీతం (K-Pop) పై ఆసక్తి పెరిగింది.

టాప్ ఆర్టిస్ట్లు: BTS, బ్లాక్‌పింక్ (Blackpink), జెన్నీ (Jennie) గురించి భారతీయులు అత్యధికంగా ఆరా తీశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ సాంగ్: రోజ్ (ROSÉ), బ్రూనో మార్స్ పాడిన ‘APT’ పాట ఈ ఏడాది అలెక్సాలో మోస్ట్ రిక్వెస్టెడ్ సాంగ్‌గా నిలిచింది.

బాలీవుడ్ క్లాసిక్స్: ఒకవైపు ఆధునిక సంగీతం వింటూనే, మరోవైపు లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, శంకర్ మహదేవన్ వంటి లెజెండ్స్ పాటలను భారతీయులు వదిలిపెట్టలేదు. అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ పాటలు ఎప్పటిలాగే టాప్ లిస్టులో ఉన్నాయి.

పాడ్‌కాస్ట్‌లపై మక్కువ: భయం, భక్తి..

నివేదిక ప్రకారం, ఈ ఏడాది పాడ్‌కాస్ట్ వినే వారి సంఖ్య భారీగా పెరిగింది.

క్రైమ్, హారర్: ‘ఖూనీ మండే’ (Khooni Monday) వారి హారర్ షోలు, ‘ది దేశీ క్రైమ్ పాడ్‌కాస్ట్’ (The Desi Crime Podcast) కు విశేష స్పందన లభించింది.

జ్ఞానం, ఆధ్యాత్మికత: బిజినెస్ విషయాల కోసం ‘ఫిన్‌షాట్స్ డైలీ’ (Finshots Daily), రణవీర్ షో, ఆధ్యాత్మికత కోసం సద్గురు పాడ్‌కాస్ట్‌లను ప్రజలు ఎక్కువగా కోరారు.

సెలబ్రిటీల గురించి ఆసక్తికరమైన ప్రశ్నలు..

భారతీయులకు సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం అంటే ఎప్పుడూ ఆసక్తే. అలెక్సాను అడిగిన కొన్ని వింతైన, ఆసక్తికరమైన ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి:

నెట్ వర్త్: విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్, ఎలోన్ మస్క్, ముఖేష్ అంబానీల ఆస్తుల విలువ ఎంత అని వేలమంది ప్రశ్నించారు.

వ్యక్తిగత వివరాలు: “సల్మాన్ ఖాన్ భార్య ఎవరు?”, “అమితాబ్ బచ్చన్ హైట్ ఎంత?”, “దిల్జీత్ దోసాంజ్ పెళ్లి ఎవరితో అయింది?” వంటి ప్రశ్నలు అలెక్సాను ఉక్కిరిబిక్కిరి చేశాయి.

సాధారణ విజ్ఞానం..

వినోదంతో పాటు, విద్యార్థులు, పెద్దలు సాధారణ విజ్ఞానం కోసం అలెక్సాను ఒక గురువులా భావించారు. భారత ప్రధాని ఎవరు? అమెరికా అధ్యక్షుడు ఎవరు? వంటి ప్రశ్నలతో పాటు భౌగోళిక అంశాలు, జనాభా వివరాల గురించి కూడా భారీగా సెర్చ్‌లు జరిగాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..