Heath Streak: తుది శ్వాస విడిచిన జింబాబ్వే కెప్టెన్.. బతికున్నాడని దృవీకరించిన 10 రోజుల్లోనే..

|

Sep 03, 2023 | 12:31 PM

Heath Streak: జింబాబ్వే బౌలర్‌గా 216 టెస్ట్ వికెట్లు, 239 వన్డే వికెట్లు పడగొట్టిన చరిత్ర స్ట్రీక్ సొంతం. అలాగే క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత జింబాబ్వే, బంగ్లాదేశ్ జాతీయ జట్లకు కోచ్‌గా.. స్కాట్లాండ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌లో కూడా స్ట్రీక్ బౌలింగ్ కోచ్‌గా గుజరాత్ లయన్స్(2016, 2017), కోల్‌కతా నైట్ రైడర్స్‌(2018) ఉన్నాడు. ఇంకా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్‌ల్లోని జట్లకు కూడా స్ట్రీక్ కోచ్‌గా..

Heath Streak: తుది శ్వాస విడిచిన జింబాబ్వే కెప్టెన్.. బతికున్నాడని దృవీకరించిన 10 రోజుల్లోనే..
Heath Streak
Follow us on

Heath Streak: జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ (49) తన తుది శ్వాస విడిచాడని అతని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ మేరకు స్ట్రీక్ భార్య నాడిన్ తన ఫేస్‌బుక్ ద్వారా మరణ వార్తను ప్రకటించారు. హీత్ స్ట్రీక్ ఎప్పుడో చనిపోయారని తప్పుడు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే హీత్ స్ట్రీక్ గురించి వస్తున్న ఈ వార్తలు అబద్ధమని అతని టీమ్‌మే హెన్నీ ఒలోంగా కొట్టిపడేశారు. అయితే ఇది జరిగిన పది రోజుల తర్వాత హీత్ స్ట్రీక్ చనిపోయారని అతని భార్య అధికారికంగా ప్రకటించారు.


ఇవి కూడా చదవండి

హీత్ స్ట్రీక్ క్రికెట్ ప్రస్థానం గురించి మాట్లాడాలంటే.. స్ట్రీక్ జింబాబ్వే కెప్టెన్‌గా ప్రసిద్ధి. ఆ దేశం తరఫున 1993 నుంచి 205 వరకు అడిన స్ట్రీక్ 65 టెస్టుల్లో 1990 పరుగులు, 189 వన్డేల్లో 2943 పరుగులు చేశాడు. ఇందులో ఓ టెస్టు సెంచరీ కూడా ఉంది. అలాగే బౌలర్‌గా 216 టెస్ట్ వికెట్లు, 239 వన్డే వికెట్లు పడగొట్టిన చరిత్ర స్ట్రీక్ సొంతం.

అలాగే క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత జింబాబ్వే, బంగ్లాదేశ్ జాతీయ జట్లకు కోచ్‌గా.. స్కాట్లాండ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. ఐపీఎల్‌లో కూడా స్ట్రీక్ బౌలింగ్ కోచ్‌గా గుజరాత్ లయన్స్(2016, 2017), కోల్‌కతా నైట్ రైడర్స్‌(2018) ఉన్నాడు. ఇంకా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, ఆఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్‌ల్లోని జట్లకు కూడా స్ట్రీక్ కోచ్‌గా ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..