ఆల్‌రౌండర్‌గా ఎంట్రీ.. పోలీసు కూతురితో లవ్‌స్టోరీ.. కట్‌ చేస్తే.. భార్యను హత్య చేసిన కేసులో ఉరి.. ఆ ప్లేయర్ ఎవరంటే?

|

Feb 24, 2023 | 6:14 PM

Leslie Hylton: వెస్టిండీస్ మాజీ ఆటగాడు లెస్లీ హిల్టన్ అత్యుత్తమ ఆల్ రౌండర్ ఆటగాళ్ళలో ఒకరిగా పేరుగాంచాడు. ఓ హత్య చేసినందుకు 50 సంవత్సరాల వయస్సులో ఉరి తీశారు.

ఆల్‌రౌండర్‌గా ఎంట్రీ.. పోలీసు కూతురితో లవ్‌స్టోరీ.. కట్‌ చేస్తే.. భార్యను హత్య చేసిన కేసులో ఉరి.. ఆ ప్లేయర్ ఎవరంటే?
Leslie Hylton
Follow us on

Leslie Hylton: ఏ క్రీడలోనైనా వివాదాలు కొత్త కాదు. ఈ క్రమంలో ఆటగాళ్లు కొట్టుకోవడం మన చాలాసార్లు చూశాం. కానీ, ఇప్పుడు మన తెలుసుకోబోయే స్టోరీ మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చట్టాన్ని ఏకంగా తన చేతుల్లోకి తీసుకొని హత్య చేయడంతో.. చివరకు సదరు నిందుతుడిని ఉరితీశారు. వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు లెస్లీ హిల్టన్ తన భార్యను చంపినందుకు 50 ఏళ్ల వయసులో ఉరి తీశారు. 1905 సంవత్సరంలో జమైకాలో జన్మించిన లెస్లీకి 3 సంవత్సరాల వయస్సులో తల్లిద్రండులు దూరమయ్యారు. సోదరి వద్ద పెరిగిన ఈ ప్లేయర్.. తొలినాళ్లలో కూలీ పని చేయడంతో పాటు టైలర్‌గా కూడా పనిచేసేవారు. అదే సమయంలో స్థానిక క్లబ్‌తో క్రికెట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అక్కడ బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయడం అందరినీ ఆకట్టుకుంది. దీంతో 1935 సంవత్సరంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. లెస్లీ తన క్రికెట్ కెరీర్‌లో 6 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను మొత్తం 70 పరుగులతో పాటు 16 వికెట్లు పడగొట్టాడు.

పోలీసు కూతురితో ప్రేమ కథ..

లెస్లీ హిల్టన్ ఒక జమైకన్ పోలీసు కూతురితో ప్రేమలో పడ్డాడు. 1942 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అంతా బాగుందనుకున్న క్రమంలో 1954 సంవత్సరంలో అతని భార్య ఏదో పని మీద న్యూయార్క్ వెళ్ళింది. ఈ క్రమంలో ఇంటికి ఒక లేఖ వచ్చింది. ఇందులో తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని లెస్లీకి తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఇలా లెస్లీకి కొన్ని రోజులపాటు నిరంతరం ఇలాంటి ఉత్తరాలు రావడం ప్రారంభించాయి. దీంతో భార్య భర్తల మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో లెస్లీ హిల్టన్ తన భార్యను 7 బుల్లెట్లతో కాల్చి చంపాడు. 1955లో లెస్లీని ఉరి తీశారు.

https://tv9telugu.com/sports887423,887389,887379,887440