Gautam Gambhir: సునీల్ నరైన్‎పై ప్రశంసలు కురిపించిన గౌతమ్ గంభీర్.. బౌలింగ్ బాగుందంటూ కితాబు..

|

Oct 12, 2021 | 9:36 PM

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్‌పై ప్రశంసలు కురిపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‎లో నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశాడని చెప్పాడు...

Gautam Gambhir: సునీల్ నరైన్‎పై ప్రశంసలు కురిపించిన గౌతమ్ గంభీర్.. బౌలింగ్ బాగుందంటూ కితాబు..
Goutham
Follow us on

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ ఆటగాడు సునీల్ నరైన్‌పై ప్రశంసలు కురిపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‎లో నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశాడని చెప్పాడు. సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కేకేఆర్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిందన్నారు. కీలకమైన ఎలిమినేటర్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్‌కు బ్రేకులు వేశాడని తెలిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేయడంతో నరైన్ ఆర్‌ర్సీబీని దెబ్బ తీశాడని.. AB డివిలియర్స్‌ని ఔట్ చేయడానికి మంచి బంతి వేశారని చెప్పారు. కేఎస్ భరత్, గ్లెన్ మాక్స్‌వెల్‎ను ఔట్ చేయడంతో మ్యాచ్ గతి మారిపోయిందని అన్నారు. 49 పరుగులకు ఒక్క వికెట్ కూడా కోల్పోని ఆర్సీబీ ఏడు వికెట్లకు కేవలం 138 పరుగులు చేసినట్లు పేర్కొన్నారు.

నరైన్ తన నాలుగు ఓవర్లలో 4/21తో పాటు వేగంగా 26 పరుగుల చేసి కేకేఆర్‎ను క్వాలిఫైయర్ 2కు సిద్ధం చేశాడని చెప్పారు. నరైన్ బౌలింగ్‌లో వైవిధ్యాలు చూపించారన్నారు. నరైన్ సామర్ధ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి మాజీ గౌతమ్ గంభీర్. 2012, 2014లో గంభీర్ కేకేఆర్‎కు కెప్టెన్‎గా విజయాలు అందించాడు. రెండు సీజన్లలో నరైన్ కీలక పాత్ర పోషించాడు. సునీల్ 2012 లో 24 వికెట్లు, 2014 లో 21 వికెట్లు పడగొట్టాడని గౌతమ్ తెలిపారు.

“విచిత్రం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ‘మిస్టరీ’ అనే పదాన్ని సునీల్ నరైన్‌తో ముడిపెట్టారు, కానీ ఎవరూ నాణ్యత అనే పదాన్ని ఉపయోగించరు. ఇది కేవలం రహస్యం అయితే, నరైన్‌ బౌలింగ్‌ మిస్టరీగానే ఉంటే ఇన్నేళ్ల పాటు విండీస్‌ తరఫున క్రికెట్‌ ఎలా ఆడుతున్నాడు. కోహ్లి, డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌లు నరైన్‌ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యారు. ఇన్నేళ్లు ఎలా అతని బౌలింగ్‌లో వెనుదిరిగారో ఇప్పుడు కూడా అలానే ఔట్‌ అయ్యారు. దీనిలో కొత్త విషయం ఎక్కడుంది. నరైన్‌ బౌలింగ్‌లో ఆ ముగ్గురు ఇప్పటికీ ఆడలేకపోతున్నారనేదానిపై మరోసారి క్లారిటీ వచ్చింది” అని అన్నారు. ఈ సీజన్‌లో నరైన్ ఇప్పటివరకు 14 వికెట్లు తీశాడు.

Read Also.. Rashid Khan: టాప్ ఫైవ్ టీ20 ఆటగాళ్లను ఎంపిక చేసిన రషీద్ ఖాన్.. ఇండియా నుంచి ఇద్దరికి చోటు.. ఎవరెవరు ఉన్నారంటే..