క్యాన్సర్‌తో పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్.. చికిత్స పొందుతూ మృతి.. ప్రధాని మోడీ సంతాపం..

|

Aug 01, 2024 | 8:22 AM

క్యాన్సర్ కు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న అన్షుమాన్ ఇటీవలే భారత దేశానికి తిరిగి వచ్చారు. అయితే గైక్వాడ్ వడోదరలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న సమయంలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆదుకోవాలంటూ బీసీసీఐకి సూచించారు. వెంటనే స్పందించిన బీసీసీఐ అధికారులకు బోర్డు కార్యదర్శి జై షా గైక్వాడ్ వైద్య ఖర్చుల కోసం సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ లోపే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.

క్యాన్సర్‌తో పోరాడి ఓడిన భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్.. చికిత్స పొందుతూ మృతి.. ప్రధాని మోడీ సంతాపం..
Anshuman Gaekwad Passed Away
Follow us on

భారత మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (71) కన్నుమూశారు. చాలాకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. గైక్వాడ్ స్వస్థలం ముంబై. క్యాన్సర్ కు లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న అన్షుమాన్ ఇటీవలే భారత దేశానికి తిరిగి వచ్చారు. అయితే గైక్వాడ్ వడోదరలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న సమయంలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆదుకోవాలంటూ బీసీసీఐకి సూచించారు. వెంటనే స్పందించిన బీసీసీఐ అధికారులకు బోర్డు కార్యదర్శి జై షా గైక్వాడ్ వైద్య ఖర్చుల కోసం సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ లోపే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.

ప్రధాని మోడీ సంతాపం..

ఇవి కూడా చదవండి

అన్షుమాన్ గైక్వాడ్ మృతికి ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవ.. కృషి ఎన్నడూ గుర్తిండి పోతుందని చెప్పారు. గైక్వాడ్ మరణ వార్త తనను బాధించిందని అన్నారు. గైక్వాడ్ ప్రతిభగల ఆటగాడని, అత్యుత్తమ కోచ్ అంటూ కొనియాడారు. కుటుంబ సభ్యులు, అభిమానులకు సానుకూతిని ప్రకటించారు మోడీ. గైక్వాడ్ మరణం క్రికెట్ కుటుంబానికి హృదయ విదారకమైనదని… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ప్రధాని తెలిపారు.

అన్షుమాన్ గైక్వాడ్ ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన వెస్టిండీస్‌పై టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టారు. 1974 నుంచి 87ల మధ్య భారత దేశం తరపున 40 టెస్ట్ మ్యాచ్ లు, 15వన్డేలు కలిపి మొత్తం భారత దేశం తరపున 55 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. 1987లో చివరి వన్డే మ్యాచ్ ఆడి క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అన్షుమాన్ గైక్వాడ్ దేశవాళీ క్రికట్ లో బారోడా తరపున 250కి పైగా మ్యాచ్‌లు ఆడారు.

అన్షుమాన్ గైక్వాడ్ ట్రాక్ రికార్డు..

70 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 30.07 సగటుతో 1985 పరుగుల సహా 2,254 పరుగులు చేశారు. మొత్తం పరుగుల్లో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1983లో జలంధర్ లో పాకిస్థాన్‌పై చేసిన 201 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు. దీంతో టెస్టు క్రికెట్‌లో అత్యంత స్లోగా డబుల్ సెంచరీ చేసిన క్రీడాకారుడిగా నిలిచారు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అన్షుమాన్ తర్వాత 1997 -2000 మధ్యకాలంలో జాతీయ టీం సెలెక్టర్‌గా, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అంతేకాదు రెండు సార్లు భారత క్రికెట్ టీమ్ కు హెడ్‌ కోచ్‌గానూ సేవలు అందించారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..