Cricketer Death : శోకసంద్రంలో భారత క్రికెట్.. రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి!

భారత క్రికెట్ చరిత్రలో ఒక వైపు మహిళల జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌లో తలపడబోతున్న శుభ సందర్భంలో మరోవైపు భారత క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. త్రిపురకు చెందిన మాజీ క్రికెటర్, అండర్-19 ప్రపంచ కప్ క్రీడాకారుడు రాజేష్ బానిక్(40) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Cricketer Death : శోకసంద్రంలో భారత క్రికెట్.. రోడ్డు ప్రమాదంలో మాజీ క్రికెటర్ మృతి!
Rajesh Banik Cricketer Death

Updated on: Nov 02, 2025 | 2:24 PM

Cricketer Death : భారత క్రికెట్ చరిత్రలో ఒక వైపు మహిళల జట్టు వరల్డ్ కప్ ఫైనల్‌లో తలపడబోతున్న శుభ సందర్భంలో మరోవైపు భారత క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. త్రిపురకు చెందిన మాజీ క్రికెటర్, అండర్-19 ప్రపంచ కప్ క్రీడాకారుడు రాజేష్ బానిక్(40) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పశ్చిమ త్రిపురలోని ఆనందానగర్‌లో జరిగిన ఈ దుర్ఘటన క్రికెట్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు వంటి ప్రముఖ ఆటగాళ్లతో కలిసి ఆడిన అనుభవం ఉన్న బానిక్ మరణం పట్ల త్రిపుర క్రికెట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.

భారత అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడిన త్రిపుర మాజీ క్రికెటర్ రాజేష్ బానిక్ (40) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ త్రిపురలోని ఆనందానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేష్ బానిక్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని అగర్తలాలోని జీబీపీ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషాదకర వార్తతో భారత క్రికెట్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. రాజేష్ బానిక్ తన కెరీర్‌లో ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు వంటి ప్రముఖ ఆటగాళ్లతో కలిసి ఆడారు.

రాజేష్ బానిక్ మృతి పట్ల త్రిపుర క్రికెట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. TCA కార్యదర్శి సుబ్రతా డే మాట్లాడుతూ, “ఒక టాలెంటెడ్ క్రికెటర్‌ను, అండర్-16 జట్టు సెలక్టర్‌ను కోల్పోవడం చాలా బాధాకరం. ఈ విషయం తెలిసి మేము షాకయ్యాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము” అని తెలిపారు.

రాజేష్ బానిక్ త్రిపుర అత్యుత్తమ ఆల్-రౌండర్‌లలో ఒకరు. అంతేకాక, టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లను ఈజీగా గుర్తించే అద్భుతమైన సామర్థ్యం ఆయనకు ఉందని, అందుకే అతడిని రాష్ట్ర అండర్-16 జట్టుకు సెలక్టర్‌గా నియమించామని సుబ్రతా డే పేర్కొన్నారు. 40 ఏళ్ల రాజేష్ బానిక్ త్రిపుర తరపున రంజీ ట్రోఫీలో కూడా ఆడారు. ఆయన గణాంకాల విషయానికి వస్తే.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆయన 42 మ్యాచ్‌లలో 1469 పరుగులు చేసి, 2 వికెట్లు తీశారు. 24 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో 378 పరుగులు చేసి, 8 వికెట్లు పడగొట్టారు. 18 టీ20 మ్యాచ్‌లలో 203 పరుగులు చేశారు. ఆయన చివరిసారిగా 2018లో ఒడిశాతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆడారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..