భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే సందడి చేస్తున్నాడు. ఏడాది పొడవునా ఫీల్డ్‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే, ధోని సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటుంటాడు. అయినప్పటికీ, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎప్పటికీ తగ్గడం లేదు. అన్ని సమయాలలోనూ సోషల్ మీడియాలో ఆధిపత్యం చెలాయించేలా చేస్తుంటారు. ధోనీ ఇటీవల తన పేరు మీద ఉన్న గ్లోబల్ స్కూల్‌కు చేరుకుని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ ధోనీకి సంబంధించిన వీడియోను పంచుకుంది. ఇక్కడ భారత మాజీ కెప్టెన్ పాఠశాల పిల్లలతో తన అనుభవాన్ని పంచుకున్నాడు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు ఈ స్టార్ క్రికెటర్‌కి ఏ సబ్జెక్ట్ బాగా నచ్చిందంటూ ఓ చిన్న అమ్మాయి ధోనిని అడిగింది. ఈ ప్రశ్న విన్న వెంటనే ధోనీకి నవ్వు వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘క్రీడలను సబ్జెక్ట్‌గా పిలుస్తా. నేను సగటు విద్యార్థిని. నేను కేవలం ఏడేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడుతున్నాను. అందుకే నేను చాలా అరుదుగా క్లాసులో ఉండేవాడిని. అయినా నేను మంచి విద్యార్థినే. 10వ తరగతిలో 66 శాతం మార్కులు, 12లో 56 శాతం మార్కులు వచ్చాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
Even Thala’s favourite period is PT! ?#WhistlePodu #Yellove ?? @msdhoni pic.twitter.com/t4MInuQhxu
— Chennai Super Kings (@ChennaiIPL) October 13, 2022
ఈ జార్ఖండ్ డైనమేట్ 10వ తరగతి పాస్ అవుతాడన్న నమ్మకం తన తండ్రికి లేదని ధోనీ పిల్లలకు తెలిపాడు. ‘నేను 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించలేనని మా నాన్న భావించారు. అందుకే బోర్డు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషంగా ఉంది. నాకు 10వ తరగతిలో 66 శాతం, 12వ తరగతిలో 56 లేదా 57 శాతం మార్కులు వచ్చాయి’ అంటూ స్టూడెంట్స్‌తో తన చిన్ననాటి సంగతులు పంచుకున్నాడు.
అందరిలాగే, ధోనీ కూడా పాఠశాల సమయమే ఉత్తమ సమయం అని నమ్ముతాడు. ఆయన మాట్లాడుతూ, ‘నేను ఏ పాఠశాలకు వెళ్లినా, నేను టైమ్ మెషీన్‌కు చేరుకున్నట్లు అనిపిస్తుంది. అయితే, అందులో చదువులతోపాటు క్రీడలు కూడా ఉన్నాయి. కానీ, బడిలో గడిపిన కాలం తిరిగి రాదు. మీకు జ్ఞాపకాలు ఉంటాయి. ఇక్కడ మీరు చూసే స్నేహితులు మీ జీవితాంతం మీతో ఉంటారు’ అంటూ ముగించాడు.