
Prithvi Shaw rumored Girl Friend Akriti Agarwal Video: ఐపీఎల్ 2025 మధ్య భారత క్రికెటర్ పృథ్వీ షా పేరు చర్చలోకి వచ్చింది. అయితే, దీని వెనుక ఉన్న కారణం లీగ్‌తో సంబంధం లేకపోవడం గమనార్హం. అతని వ్యక్తిగత జీవితంతో సంబంధం కలిగి ఉంది. బుధవారం సాయంత్రం నుంచి ఓ వీడియోలలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో, పృథ్వీ షా కారు నడుపుతుండగా, అతని పక్కనే ఉన్న సీటులో ఒక అందమైన మహిళ కూర్చుని ఉంది. అయితే, ఆమె తన మోహాన్ని చేతులతో కవర్ చేస్తూ మీడియా కంట పడింది. దీంతో నెటిజన్లు పృథ్వీ షా కొత్త ప్రేమికురాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
షా వీడియో వైరల్ అయిన తర్వాత, అతని రూమర్ గర్ల్ ఫ్రెండ్ నిధి తపారియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టోరీని షేర్ చేసింది. అతని కష్టకాలంలో మద్దతు ఇస్తే, ఆపై మీకు ద్రోహం చేస్తాడంటూ రాసుకొచ్చింది. దీన్ని బట్టి పృథ్వీ షా, నిధి తపారియా మధ్య ఖచ్చితంగా ఏదో తేడా కొడుతోందని స్పష్టమవుతోంది. అయితే, దీనిపై పృథ్వీ షా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. పృథ్వీ షా కొత్త స్నేహితురాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
యువ క్రికెటర్ పృథ్వీ షా కలిసి ఉన్న ఈ అమ్మాయి పేరు ఆకృతి అగర్వాల్. ఆకృతి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ఈమె చిన్నప్పటి నుంచి నృత్యం, పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. దీని కారణంగా ఆమె తన కెరీర్ ప్రారంభంలో టిక్ టాక్‌లో వీడియోలు చేయడం ప్రారంభించింది. టిక్ టాక్ భారతదేశంలో నిషేధించిన తర్వాత.. ఆకృతి తన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ప్రారంభించింది.
ఈ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన తర్వాత ఆకృతి విపరీతమైన ఫాలోవర్స్‌ని పొందింది. ఆమె అందమైన చిరునవ్వు, ఆకర్షణ, అందం కారణంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 3.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..