MLC: భారత క్రికెట్‌కు గుడ్‌బై.. విదేశీ లీగ్‌లకు మాత్రం ఓకే.. ఆ చెన్నై స్టార్ ప్లేయర్ ఎవరంటే?

|

Jun 16, 2023 | 4:18 PM

Major League Cricket: ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన అంబటి రాయుడు.. మళ్లీ క్రికెట్ మైదానంలో బ్యాట్ ఝుళిపించేందుకు సిద్ధమయ్యాడు.

MLC: భారత క్రికెట్‌కు గుడ్‌బై.. విదేశీ లీగ్‌లకు మాత్రం ఓకే.. ఆ చెన్నై స్టార్ ప్లేయర్ ఎవరంటే?
Csk
Follow us on

Ambati Rayudu: ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించిన అంబటి రాయుడు.. జట్టును ఛాంపియన్‌షిప్‌కు నడిపించిన తర్వాత అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి తన మనసు మార్చుకున్న రాయుడు.. మళ్లీ క్రికెట్ మైదానంలో బ్యాట్ ఝుళిపించేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ తర్వాత రాయుడు తాను భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు రాయుడు అమెరికన్ టీ20 లీగ్ మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు.

రాయుడు ఈ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ జట్టు అయిన టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున ఆడతాడని టెక్సాస్ సూపర్ కింగ్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చింది. ఈ లీగ్ మొదటి సీజన్‌లో ఆరు జట్లు ఆడనున్నాయి. మొదటి సీజన్ జులై 13 నుంచి 31 వరకు జరుగుతుంది.

ఈ లీగ్‌లో డెవాన్ కాన్వే పేరు కూడా ఉంది. అతడితో పాటు న్యూజిలాండ్‌కు చెందిన మరో ఆటగాడు మిచెల్ సాంట్నర్ కూడా ఆడనున్నాడు. ఈ జట్టులో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో కూడా ఆడనున్నాడు. డేవిడ్ మిల్లర్ టెక్సాస్ తరపున కూడా ఆడనున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆ జట్టు తన తొలి మ్యాచ్‌ని లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్‌తో ఆడనుంది. చెన్నై, కోల్‌కతాతో పాటు ముంబై, ఢిల్లీకి చెందిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఈ లీగ్‌లో జట్లను కొనుగోలు చేశాయి.

ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున మూడు ఐపీఎల్ టైటిల్‌లను గెలుచుకున్న రాయుడు (2018, 2021, 2023) చెన్నై జట్టులో భాగమయ్యాడు. ఈ ఏడాది ఐపీఎల్‌, భారత క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకున్న అతను ఇప్పుడు విదేశీ లీగ్‌లలో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.

ఈ లీగ్‌లో టెక్సాస్ జట్టు నైట్ రైడర్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జులై 16న వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో రెండో గేమ్ ఆడనుంది. ఆ తర్వాత జులై 17న జరిగే మూడో గేమ్‌లో న్యూయార్క్‌తో MAI తలపడుతుంది. జులై 21న సీటెల్ ఓర్కాస్‌తో తలపడనుంది. మూడు రోజుల తర్వాత జులై 24న శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌తో తలపడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..