ఇండియన్ క్రికెట్ టీంకు పార్ట్ టైమ్ బౌలర్ల అవసరం చాలా ఉంది.. బౌలర్ల కొరత గురించి అభిప్రాయం వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్..

ఇండియన్ క్రికెట్ టీంకు పార్ట్‌టైమ్ బౌలర్ల అవసరం చాలా ఉందని చెబుతున్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా.

  • Publish Date - 5:25 am, Wed, 9 December 20
ఇండియన్ క్రికెట్ టీంకు పార్ట్ టైమ్ బౌలర్ల అవసరం చాలా ఉంది.. బౌలర్ల కొరత గురించి అభిప్రాయం వ్యక్తం చేసిన మాజీ క్రికెటర్..

ఇండియన్ క్రికెట్ టీంకు పార్ట్‌టైమ్ బౌలర్ల అవసరం చాలా ఉందని చెబుతున్నాడు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా. ప్రస్తుతం భారత్‌కు అలాంటి సేవలు లభించడం లేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఎందుకంటే బ్యాట్స్‌మెన్ బౌలింగ్ చేయడం.. బౌలర్లు బ్యాటింగ్ చేయడం అత్యంత కీలకం అన్నారు.

తన హయాంలో పార్ట్‌టైమ్ బౌలర్‌గా వికెట్లు పడగొట్టినప్పుడు చాలా సంతోషంగా ఉండేదని ప్రకటించాడు. సచిన్, వీరూ, యువరాజ్, తాను పార్ట్‌టైమ్ బౌలింగ్ చేసేవాళ్లమని గుర్తుచేశాడు. బ్యాట్స్‌మెన్ అప్పుడప్పుడు బౌలింగ్ వేసి వికెట్లు తీయడం.. బౌలర్ అప్పుడప్పుడు బ్యాటింగ్ చేసి రన్స్ సాధించడం వల్ల జట్టు సమతూకంతో ఉంటుందన్నాడు. అంతేకాకుండా ఇలా చేస్తే జట్టుకు కలిసొస్తుందని చెప్పాడు. బ్యాట్స్‌మెన్ నాలుగైదు ఓవర్లు బౌలింగ్ వేయడం వల్ల ప్రధాన బౌలర్‌కు వికెట్లు తీయడానికి దోహదపడుతుందని తెలిపాడు. తాను గ్రామాల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ వస్తుందో లేదో అని రెండిటికి సిద్దపడి ఉండేవాళ్లమని అన్నాడు. అంతేకాకుండా ఇవి రెండు రాకపోతే ఫీల్డింగ్‌తోనైనా ఆకట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్లమని చెప్పుకొచ్చాడు రైనా.