Dhoni-Kohli: మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. కానీ, ఆటగాడిగా మాత్రం కాదు. టీమిండియాకు గురువులా టీంతో చేరాడు. 2021 టీ 20 వరల్డ్ కప్ (2021 T20 World Cup) కోసం 15 మంది సభ్యుల భారత జట్టుకు మెంటార్‌గా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని బీసీసీఐ బుధవారం నియమించింది. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. 40 ఏళ్ల ధోని 15 ఆగస్టు 2020 న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారతదేశం కోసం చివరి మ్యాచ్ ఆడాడు. ఇందులో న్యూజిలాండ్ చేతిలో జట్టు ఓడిపోయింది. కానీ, ప్రస్తుతం రవిశాస్త్రి, విక్రమ్ రాథోడ్, భరత్ అరుణ్, ఆర్ శ్రీధర్ రూపంలో టీమిండియాకు మంచి సహాయక సిబ్బంది ఉండగా.. ధోనీని ఎందుకు టీమిండియాతో చేర్చారనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించినప్పుడు, ధోనీని మెంటార్‌గా ఎందుకు ఎంపిక చేశారనే దానిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. టీంను ప్రకటించిన సమయంలో బీసీసీఐ సెక్రటరీ జే షా మాట్లాడుతూ, “టీ 20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్ (గైడింగ్)గా వ్యవహరించనున్నారు. నేను దుబాయ్‌లో ఉన్న ధోనితో మాట్లాడాను. అతను టీ 20 ప్రపంచ కప్‌కు మార్గదర్శకుడిగా ఉండటానికి మాత్రమే అంగీకరించాడు. నేను ఈ విషయంపై నా సహచరులందరితో మాట్లాడాను. అందరూ అంగీకరించారు. నేను కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కూడా మాట్లాడాను” అని వివరించారు.
ధోని ఎంపికకు కారణం ఏంటంటే..
పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించిన అనుభవం దృష్ట్యా ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. ముఖ్యమైన ఐసీసీ టోర్నమెంట్‌లను గెలవడానికి ఎలా ప్లాన్ చేయాలో ధోనికి బాగా తెలుసు. ధోనీ కెప్టెన్సీలో తొలి టీ 20 ప్రపంచకప్‌ని భారత్ గెలచుకుంది. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ధోని ఒకడిగా నిలిచాడు. ధోని నాయకత్వంలో భారతదేశం రెండు వరల్డ్ కప్ టైటిల్స్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాలో 2007 టీ 20 ప్రపంచ కప్, 2011 లో భారతదేశంలో వన్డే ప్రపంచ కప్. 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. దీంతో ఐసీసీ టోర్నమెంట్లను గెలిచిన అనుభవం కోహ్లీ సేనకు అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐసీసీ టోర్నమెంట్లలో అంత మంచి రికార్డు లేకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
ఐసీసీ టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు జట్టుకు ఎలాంటి ట్రోఫీని గెలవలేదు. అతని కెప్టెన్సీలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ (2017), వరల్డ్ కప్ (2019), వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (2021) ఆడింది. కానీ, ట్రోఫీకి దూరంగా నిలిచింది.
The Reunion we all have been waiting for ? @msdhoni returns to mentor #TeamIndia for the #T20WorldCup ?
How excited are you to see him back? ? pic.twitter.com/znPWBLeYNo
— BCCI (@BCCI) September 8, 2021
Also Read: