శ్రీలంక క్రికెట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. గత కొద్దిరోజులుగా ఆ దేశ క్రికెట్ బోర్డు, క్రికెటర్లకు మధ్య కాంట్రాక్ట్ విషయంలో వివాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌తో జరగాల్సిన టీ20, వన్డే సిరీస్ ముందు శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఆ దేశ ఆటగాళ్లు ఊహించని షాక్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం టీమిండియా, శ్రీలంక సిరీస్ జూలై 13 నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈలోపే లంకకు చెందిన ఐదుగురు క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కు ముందు కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
శ్రీలంక క్రికెట్ బోర్డు మొత్తం 24 మంది క్రికెటర్లకు కాంట్రాక్ట్ ఆఫర్ చేయగా.. విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్‌దెనియా సంతకం చేసేందుకు నిరాకరించారట. కాగా, ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న కుశాల్ మెండిస్, గుణతిలక, డిక్లెల్వా బయోబబుల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.
Also Read:
రోజూ ఎన్ని బాదంపప్పులు తినాలి.? అతిగా తింటే ఏమవుతుంది.! ఈ విషయాలు తెలుసుకోండి
వామ్మో.. మొసలితో ఆ పిచ్చి గేమ్స్ ఏంటి అమ్మాయి.? వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!