క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న సెకండాఫ్ ఐపీఎల్ మ్యాచ్‌లను చూసేందుకు ప్రేక్షకులకు అనుమతిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
https://222.iplt20.com/, PlatinumList.net వెబ్‌సైట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చునని పేర్కొంది. కాగా గతేడాది ఐపీఎల్ కూడా యూఏఈలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు కరోనా కారణంగా మ్యాచ్‌లు చూసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో.. తక్కువ సంఖ్యలో ఆడియన్స్ స్టాండ్స్‌లో హాజరైతే.. మ్యాచ్‌లు మరింత కిక్కునిస్తాయని చెప్పొచ్చు.
కాగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా నిలిచిన విషయం తెలిసిందే. వరుసపెట్టి ఆటగాళ్లు కరోనా బారినపడటంతో బీసీసీఐ టోర్నీని వాయిదా వేసింది. అయితే ఇప్పుడు వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 15వ తేదీన ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగుతుంది. ఇప్పటికే అన్ని టీమ్స్ ప్లేయర్స్ యూఏఈ చేరుకొని ప్రాక్టీస్ షూరూ చేశారు.
Read Also:
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్