ENGW vs INDW: పొట్టి క్రికెట్‌లో సత్తా చాటేనా..! ఇంగ్లండ్‌తో నేటినుంచి టీ20 సిరీస్ ప్రారంభం

|

Jul 09, 2021 | 11:21 AM

భారత్, ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య టీ 20 సిరీస్ శుక్రవారం నుంచి మొదలుకానుంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేడు నార్తాంప్టన్‌షైర్‌లో జరగనుంది. ఏకైక టెస్టుని టీమిండియా మహిళలు డ్రా చేసుకున్నారు.

ENGW vs INDW: పొట్టి క్రికెట్‌లో సత్తా చాటేనా..! ఇంగ్లండ్‌తో నేటినుంచి టీ20 సిరీస్ ప్రారంభం
Pjimage 17 1
Follow us on

England Women vs India Women, 1st T20 Preview: భారత్, ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య టీ 20 సిరీస్ శుక్రవారం నుంచి మొదలుకానుంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ నేడు నార్తాంప్టన్‌షైర్‌లో జరగనుంది. ఏకైక టెస్టుని టీమిండియా మహిళలు డ్రా చేసుకున్నారు. అనంతరం ఆడిన మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత మహిళలు టీ 20 సిరీస్‌లో విజయం సాధించి, సిరీస్ గెలవాలని, దాంతో ఇంగ్లండ్ పర్యటనను ఘనంగా ముగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీలో అతిపెద్ద మార్పు కనిపించనుది. మిథాలీ రాజ్ స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వన్డే సిరీస్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆటతీరును పరిశీలిస్తే చాలా దారుణంగా తయారైంది. ఇంగ్లండ్‌లో జరిగిన టెస్టు, వన్డేల్లో పరుగులు చేయలేక వెంటనే పెవిలియన్ చేరింది. టీ 20 సిరీస్‌లో తిరిగి పుంజుకోవాలని హర్మన్‌ప్రీత్ కౌర్ చూస్తోంది.

వన్డేల్లో మిథాలీ రాజ్ జట్టును ముందుండి నడిపించింది. అలాగే మొదటి రెండు వన్డేల్లో ఓడిపోయినా.. మూడో వన్డేలో మాత్రం ఘన విజయం సాధించింది. మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు హర్మన్‌ ప్రీత్ కౌర్ టీ 20 సిరీస్‌ ను లీడ్ చేయనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో విజయం.. టీమిండియా ఉమెన్స్‌కు కచ్చితంగా పాజిటివ్ హోప్‌ను అందివ్వనుందనడంలో సందేహం లేదు. అలాగే భారత జట్టు వేగంగా పరుగులు సాధించడంలో విఫలమవుతోంది. టాప్ ఆర్డర్‌లో షఫాలీ వర్మ, స్మృతి మంధనా వంటి బలమైన బ్యాటర్లు ఉన్నారు. వీరందించిన మంచి ఆరంభాలను మిడిలార్డర్ అందుకోవడంలో విఫలవుగున్నారు. అయితే, పొట్టి ఫార్మెట్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా అదరగొడుతుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఇప్పటివరకు ఆడిన 5 టీ 20 ల్లో 4-1 తేడాతో ఇంగ్లీష్ జట్టు మెరుగ్గా ఉంది. అలాగే ఇంగ్లాండ్‌లో, భారత మహిళా జట్టు ఇప్పటివరకు 11 టీ 20 లు ఆడింది. ఇందులో 4 టీ20ల్లో విజయం సాధించింది. 7 టీ20ల్లో ఓడిపోయింది. ఇప్పటి వరకు టీమిండియా ఉమెన్స్ మొత్తం 126 టీ 20 లు ఆడింది. ఇందులో 68 గెలిచింది. 56 టీ20ల్లో పరాజయం పాలైంది.

Also Read:

Oil Wrestling : మల్లయుద్ధంలో కాసింత తైలాన్ని జోడిస్తే ఆ మజానే వేరబ్బా…!

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన 23 ఏళ్ల యంగ్ ప్లేయర్.. పతకం కోసం బలమైన పోటీదారుడిగా బరిలోకి..!