
England vs India, 3rd Test: ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్‌లో భారత జట్టు పోరాడి ఓడిపోయింది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 170 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ జట్టు 3వ టెస్టులో 22 పరుగుల తేడాతో విజయం సాధించి, 5 టెస్ట్‌ల సిరీస్‌లో 2-1 తో ముందంజలో ఉంది. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా (61 పరుగులతో నాటౌట్) ఒక్కడే ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. మిగతా వాళ్లంతా అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరారు. సిరాజ్ 4, జస్‌ప్రీత్ బుమ్రా 54 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటయ్యారు.
నితీష్ కుమార్ రెడ్డి 13, వాషింగ్టన్ సుందర్ 0, కేఎల్ రాహుల్ 39, రిషబ్ పంత్ 9 పరుగులతో పెవిలియన్‌కు చేరారు. అంతకుముందు ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేసి భారత్‌కు 193 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. మొదటి ఇన్నింగ్స్‌లో, రెండు జట్లు 387 స్కోరుతో సమానంగా నిలిచాయి.
భారత్: శుభమన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..